Dhurandhar OTT: 1300 కోట్ల వసూళ్లతో రణ్‌వీర్ సరికొత్త చరిత్ర.. ఓటీటీలోకి ధురంధర్ ఎప్పుడు? ఎందులో అంటే?

ఆదిత్య ధార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై, యాక్షన్ మూవీ ధురంధర్. విడుదలైన క్షణం నుంచి నేటి వరకు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాలలో నాలుగో స్థానానికి చేరుకుంది. 50 రోజులు కావొస్తున్నా ధురంధర్ నేటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భారీ యాక్షన్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికి చిత్ర యూనిట్ శుభవార్త చెప్పింది. ధురంధర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసింది. మరి రణ్‌వీర్ సింగ్ మూవీ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో చూస్తే..

ధురంధర్ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Dhurandhar OTT Release Netflix Locked Ranveer Singh s Movie Online Streaming date After Theatrical Run

ధురంధర్ బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా బాలీవుడ్ వర్గాల టాక్. ధురంధర్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

ధురంధర్ కలెక్షన్స్ ఎంత
రణ్‌వీర్ సింగ్ మూవీకి ఇండియాలో తొలి వారం 207.25 కోట్ల రూపాయలు, రెండో వారంలో 253.25 కోట్ల రూపాయలు, మూడో వారంలో 172 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 106.5 కోట్ల రూపాయలు, ఐదో వారంలో 51.25 కోట్ల రూపాయలు, ఆరో వారంలో 26.35 కోట్ల రూపాయలు చొప్పున 47 రోజుల వరకు ఇండియాలో 828.25 కోట్ల రూపాయల నెట్.. 993.6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది. ఇక ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 293.9 కోట్ల రూపాయలు వసూలైంది. దాంతో వరల్డ్ వైడ్‌గా 47 రోజుల వరకు 1287.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. అయితే ఈ చిత్రం 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 50 రోజులకు దగ్గరవుతున్నా రోజుకు కనీసం 3 కోట్ల రూపాయలు.. వీకెండ్‌లో 6 కోట్ల వరకు రాబడుతూ ధురంధర్ మూవీ సంచలనం సృష్టిస్తోంది.

ధురంధర్ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్
ధురంధర్ మూవీ డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 130 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. ఇది రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే రికార్డ్ స్థాయిలో జరిగిన ఓటీటీ డీల్. థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వాలనే ఒప్పందం మేరకు ఈ డీల్ జరిగింది. తాజాగా ధురంధర్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. జనవరి 31వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. థియేటర్‌లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ధురంధర్ మరి ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: ranveer singh Dhurandhar netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X