Dhurandhar OTT: దురంధర్ కలెక్షన్ల విధ్వంసం.. రికార్డ్ ధరకు రణ్‌వీర్ మూవీ ఓటీటీ డీల్, ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి రాణిస్తోంది. ఐదు రోజుల్లోనే 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరి ట్రేడ్ పండితులను షాక్‌కు గురిచేస్తోంది. ఇండియా, ఓవర్సీస్‌ ఇలా అన్ని సెంటర్స్‌లోనూ రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే దురంధర్ మూవీ ఏ ఓటీటీలో? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని రణ్‌వీర్ సింగ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి చిత్ర యూనిట్ తెరదించింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Dhurandhar OTT Release When And Where To Watch Ranveer Singh s Movie Online After Theatrical Run

దురంధర్ బడ్జెట్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. అలాగే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా బాలీవుడ్ వర్గాల టాక్. దురంధర్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి. రణ్‌వీర్ సింగ్ మూవీని వరల్డ్ వైడ్‌గా 4000 స్క్రీన్‌లలో విడుదల చేశారు.

దురంధర్ కలెక్షన్స్
దురంధర్ మూవీ తొలి రోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 27 కోట్ల రూపాయలు చొప్పున ఐదు రోజుల్లో ఇండియా వైడ్‌గా 152.75 కోట్ల రూపాయల నెట్.. 182 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో దురంధర్ మూవీకి 45 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రణ్‌వీర్ సింగ్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 230 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో తొలి వారమే దురంధర్ మూవీ 300 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపడనక్కర్లేదని అంటున్నారు.

రికార్డు ధరకు దురంధర్ ఓటీటీ డీల్
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పంట పండిస్తోన్న దురంధర్ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు పోటీపడ్డాయి. అయితే చివరికి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ కళ్లు చెదిర ధరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 130 కోట్ల రూపాయలు వెచ్చిందట. ఇది రణ్‌వీర్ కెరీర్‌లో ఓ సినిమాకు జరిగిన రికార్డు స్థాయి ఓటీటీ బిజినెస్. బాలీవుడ్‌ చరిత్రలోనూ దురంధర్ ఓటీటీ సంచలనం సృష్టించింది.

దురంధర్ ఓటీటీలో ఎప్పుడు?
రణ్‌వీర్ సింగ్ స్పై, యాక్షన్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే థియేటర్స్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ కావాలనే నిబంధన మేరకు నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం చేసుకుంది. దీనిని బట్టి దురంధర్ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. మరి థియేటర్స్‌లో దురంధర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: ranveer singh Dhurandhar netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X