Dhurandhar OTT: తెలుగు ఆడియెన్స్‌కు స్పెషల్ ట్రీట్.. చూడని ఆ సీన్స్ తో ‘దురంధర్'
Dhurandhar OTT: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, ర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'దురంధర్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మాటల్లో చెప్పలేం. బాలీవుడ్ సినిమాల అత్యధిక కలెక్షన్ల రికార్డులు, అలాగే స్టార్ హీరోల లైఫ్ టైమ్ వసూళ్ల రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. ఇలా థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త అవతార్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇది ఒక ప్రత్యేక ట్రీట్‌గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ సినిమా దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ సినిమాకి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

ధురంధర్ పార్ట్ 1 కంటే ధురంధర్ పార్ట్ 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2025 డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విడుదలైన 'దురంధర్ 2' కూడా ఆ రికార్డులను దాటుతూ రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. భారీ స్టార్ కాస్ట్, హై వోల్టేజ్ యాక్షన్, దేశభక్తి నేపథ్యం అన్ని కలిపి ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో హిట్‌గా నిలిపాయి.
ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్స్ మరింత హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా 'దురంధర్ పార్ట్ 1'ను 'Raw & Undekha' అనే పేరుతో అన్‌కట్ వెర్షన్‌గా తీసుకురావడం ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. థియేటర్లలో సెన్సార్ కారణంగా తొలగించిన సీన్లు, పవర్‌ఫుల్ డైలాగ్స్ అన్ని ఈ వెర్షన్‌లో ఉండబోతుండటంతో సినిమా అసలు రూపం ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కోసం ఈ అన్‌కట్ వెర్షన్‌ను మే 22 నుంచి Netflixలో అందుబాటులోకి తీసుకురానున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ వెర్షన్ స్ట్రీమింగ్ కానుండటం మరో ప్లస్ పాయింట్. ఇప్పటికే ఓవర్సీస్‌లో పార్ట్ 2 అన్‌కట్ వెర్షన్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో, ఇప్పుడు పార్ట్ 1 కూడా అదే ఫార్మాట్‌లో విడుదల చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది.
అయితే ఈ రిలీజ్‌తో పాటు ఒక పెద్ద కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. ఎందుకంటే 'దురంధర్ 2' ఓవర్సీస్‌లో Netflixలో అందుబాటులో ఉండగా, ఇండియన్ ఆడియెన్స్ కోసం మాత్రం జూన్ 4 నుంచి జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు పార్ట్ 1 రా వెర్షన్‌ను అదే మే 22న ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో కూడా తీసుకురావడం ఫ్యాన్స్‌ను గందరగోళానికి గురి చేస్తోంది.
ఒకే ఫ్రాంచైజీకి చెందిన రెండు భాగాలు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో, వేర్వేరు తేదీల్లో విడుదల కావడం ఓటీటీ ట్రెండ్‌లో కొత్త మార్పుగా చెప్పుకోవచ్చు. కొందరు ఫ్యాన్స్ దీనిని స్మార్ట్ స్ట్రాటజీగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం "ముందే అన్‌కట్ వెర్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై మీమ్స్, డిస్కషన్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక కథ పరంగా చూస్తే, 'దురంధర్' ఒక హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్. పాకిస్తాన్‌లోని ల్యారీ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నాశనం చేయడానికి భారత ఏజెంట్ జస్కీరాత్ సింగ్ రంగంలోకి దిగుతాడు. తన అసలు గుర్తింపును దాచిపెట్టి, శత్రువుల గూటిలోకి చొరబడి, వారి నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడనేదే సినిమా ప్రధాన కథాంశం. యాక్షన్, ఎమోషన్, స్ట్రాటజీ అన్ని కలిపి ఈ మూవీని మైండ్‌బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలిపాయి.
మొత్తంగా చూస్తే, 'దురంధర్' అన్‌కట్ వెర్షన్ రిలీజ్ తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. కానీ ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో, వేర్వేరు భాగాలు వేర్వేరు తేదీల్లో రావడం వల్ల కొంత కన్ఫ్యూజన్ కూడా కొనసాగుతోంది. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ 'రా వెర్షన్'లో ఉన్న కొత్త సీన్లు, డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications





