Dhurandhar 2 on OTT: ఓటీటీలో ధురంధర్ 2.. 1800 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. విడుదలైన ప్రతీ చోట ప్రేక్షకులు ఆదరించడంతో ఈ చిత్రం వసూళ్ల రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది? ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది? అనే వివరాల్లోకి వెళితే..

ధురంధర్ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ 2 ట్రేడ్ అనలిస్టుల ఊహకు మించి బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మెన్స్ చూపించింది. ఈ చిత్రం దాదాపు 76 రోజులకుపైగా వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించింది. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. ఈ చిత్రం సినిమా పరిశ్రమ సరికొత్త మైలురాళ్లను సెట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రం థియేట్రికల్ రన్ విషయానికి వస్తే.. కర్ణాటకలో 142 కోట్ల రూపాయలు, తెలంగాణలో 73 కోట్లు, ఆంధ్రాలో 28 కోట్లు, తమిళనాడులో 40 కో ట్లు, కేరళలో 20 కోట్ల రూపాయలతో దక్షిణాదిలో 302 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో 225 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1813 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇండియాలో 1149 కోట్ల రూపాయల నెట్, 1375 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 438 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
థియేటర్లలో విజయ ఢంకా మోగించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. జూన్ 4వ తేదీ నుంచి ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నది. ఇప్పటికే థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మరోసారి ఓటీటీలో ఈ సినిమాను ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications