twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    OTT: ఆ సంస్థకు యశోద సినిమా ఓటీటీ హక్కులు.. ప్రాఫిట్ ఎంతంటే?

    |

    సమంత కథానాయికగా నటించిన లేడి ఓరియెంటెడ్ మూవీ యశోద నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ అందుకునే ప్రయత్నం చేసింది. ఇక శని ఆదివారాలు మరింత కలెక్షన్స్ పెరిగితే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను తొందరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ సినిమాను హరి-హరీష్ దర్శకులు తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

    ఇక ఆదిత్య 369 వంటి విభిన్నమైన సినిమాలను తెరపైకి తీసుకు వచ్చిన ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. టీజర్ ట్రైలర్ తోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకునేందుకు కొన్ని ప్రముఖ సంస్థలు పోటీపడ్డాయి. యశోద సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా ఫ్యాన్ ఇండియా తరహాలో హిందీ తమిళ్ మలయాళం భాషల్లో కూడా విడుదల చేశారు.

    digital streaming rights of Yashoda are with Amazon Prime Video

    అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం మొదట హాట్ స్టార్ నెట్ ఫ్లిక్స్ కూడా పోటీ పడ్డాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కుల కోసం బాగానే ఆఫర్ చేసినట్లు ఆమధ్య టాక్ అయితే వచ్చింది. ఇక ఫైనల్ గా నిర్మాత యశోద సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కు విక్రయించినట్లుగా అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇక అమెజాన్ ప్రైమ్ ద్వారా నిర్మాతకు మంచి లాభం చేకూరినట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం. దాదాపు 25 కోట్ల రూపాయలకు ఓటీటీ హక్కులను ఆ సంస్థ చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కంటెంట్ పాన్ ఇండియాకు తగ్గట్టుగా ఉండడంతో నిర్మాత అయితే ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. మొదట కేవలం నాలుగు కోట్లతో అనుకున్న ఈ సినిమాను ఆ తర్వాత దాదాపు 35 కోట్ల వరకు ఖర్చు చేసి తెరిపైకి తీసుకు వచ్చినట్లుగా ఆయన పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    digital streaming rights of Yashoda are with Amazon Prime Video
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X