Balagam OTT: భారీ కలెక్షన్స్ అందుకుంటున్న సమయంలోనే ఓటీటీ రిలీజ్.. వారికి మాత్రమే!

దిల్ రాజు ప్రొడక్షన్ లో కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ జోడీగా ఈ సినిమాలో నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ పల్లెటూరి కథగా దీనిని ఆవిష్కరించిన వేణు బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో జరిగే ఒక కథగా దీనిని ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకున్నారు. బలమైన కథలకు ఎప్పుడూ కూడా జీవం ఉంటుందని, బలగం సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.

ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన నటనతో మెప్పించారు అని ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీలోని ప్రతి పాత్ర మన గ్రామీణ ప్రాంతాల్లో మన మధ్య ఎవరో ఒక్కరిలో చూసే ఉంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ మూవీ థియేటర్స్ లో ఏకంగా 20 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న సినిమాల కోసం దిల్ రాజు ప్రత్యేకంగా మరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అందులో మొదటి సినిమా బలగం నిర్మించారు.

Dil Raju Production balagam movie Digital streaming date update

కేవలం 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 10 రెట్లు అధికంగా ప్రాఫిట్స్ తీసుకురావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు బలగం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యింది. బలగం సినిమాని డీసెంట్ ధరకి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సంస్థ సొంతం చేసుకుంది. మార్చి 24న ఈ సినిమాని సింప్లి సౌత్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ప్రసారం చేయబోతున్నట్లు అఫీషియల్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.

ఈ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సింప్లి సౌత్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమాను కేవలం ఓవర్సీస్ వీక్షకులు మాత్రమే చూసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఇక ఇక్కడ ఓటీటీ రిలీజ్ కు మాత్రం ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

Dil Raju Production balagam movie Digital streaming date update

ఆప్యాయంగా పెరిగిన వారి జీవితంలో ప్రియమైన వ్యక్తుల మరణం విడిపోయిన బంధాలని కలపగాలదా? అనే ట్వీట్ పెట్టి డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేయడం విశేషం. థియేటర్స్ లో బలగం సినిమాని చూడని విదేశీ ఫ్యామిలీ ఆడియన్స్ మరికొన్ని గంటల్లో ఇంట్లో కూర్చొని ఓ మంచి చిత్రాన్ని చూసే అవకాశం లభిస్తుంది అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X