మోహన్‌లాల్‌నే వణికించిన మూవీ ఓటీటీలోకి .. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు తీయడంలో భారతీయ చిత్ర పరిశ్రమలో మలయాళీలకి ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్‌లోని అన్ని భాషల్లోనూ ఈ జోనర్స్‌లో సినిమాలు వచ్చినా మలయాళీల టేకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీలు అందుబాటులోకి రావడంతో మలయాళ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. లో బడ్జెట్‌తో సినిమాలు తీసి భారీ వసూళ్లను అందుకోవడంలో వీరు స్పెషలిస్టులు. తాజాగా మలయాళంలో తెరకెక్కిన ఓ మర్డర్ మిస్టరీ మూవీ దక్షిణాది భాషల్లో ఓటీటీలలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

అశిక్ అబు దర్శకత్వంలో విజయ రాఘవన్, దిలీశ్ పోతన్, వాణీ విశ్వనాథ్, అనురాజ్ కశ్యప్ కీలక పాత్రల్లో పోషించిన చిత్రం రైఫిల్ క్లబ్. శ్యామ్ పుష్కరన్ ఈ సినిమాకు కథను అందించగా.. రేక్స్ విజయన్ స్వరాలు సమకూర్చారు. ఓపీఎం సినిమాస్, టీఆర్‌యూ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా గతేడాది డిసెంబర్ 19న విడుదలన రైఫిల్ క్లబ్ మలయాళ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది.

dileesh pothan and vijaya raghavan starrer Rifle Club ott release confirmed here s the details

ఓ ప్రేమ జంట అనుకోని పరిస్ధితుల్లో ఓ వ్యక్తిని హత్య చేస్తుంది. అయితే వారు చంపింది మంగళూరులో పేరు మోసిన మాఫియా డాన్ కొడుకు కావడంతో తన బిడ్డను చంపిన వాళ్ల కోసం అతను వెంటాడతాడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రేమ జంట కేరళలోని వయనాడ్ ప్రాంతానికి వచ్చి ఓ రైఫిల్ క్లబ్‌లో తలదాచుకుంటుంది. ఈ క్లబ్‌ను షూటింగ్‌లో ఎక్స్‌పర్ట్స్ అయిన ముగ్గురు వ్యక్తులు నడుపుతారు. దుండగుల బారి నుంచి ప్రేమ జంటను ఈ రైఫిల్ క్లబ్ ఓనర్స్ ఎలా కాపాడారు? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్నదే రైఫిల్ క్లబ్ సినిమా కథ.

రోటీన్ రివేంజ్ స్టోరీయే అయినా ఈ సినిమాలోని యాక్షన్ స్టంట్స్, రైఫిల్ క్లబ్‌లోని ముగ్గురు షార్ప్ షూటర్ల సాహసం, కొత్తగా చేసిన ప్రజెంటేషన్ ఈ సినిమా చూసిన వారికి కొత్త అనుభూతిని ఇచ్చింది. కుర్ర కారుకు ఈ సినిమా బాగా ఎక్కడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే సమయంలో థియేటర్‌లో ఉన్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన బరోజ్ : 3 డీ, ఉన్ని ముకుందన్ మార్కోలను సైతం రైఫిల్ క్లబ్ వణికించింది.

dileesh pothan and vijaya raghavan starrer Rifle Club ott release confirmed here s the details

ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఈ సంస్థ వెల్లడించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 16 నుంచి రైఫిల్ క్లబ్ అందుబాటులో ఉంటుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను మీరూ చూసేయండి.

More from Filmibeat

Read more about: rifle club ott news netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X