twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Panchatantra Kathalu భేష్.. హృదయానికి హత్తుకునేలా.. చిత్ర యూనిట్‌పై రాఘవేంద్రరావు ప్రశంసల వర్షం

    |

    మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డీ మ‌ధు నిర్మించిన చిత్రం పంచ‌తంత్ర క‌థ‌లు. బిగ్‌బాస్ ఫేమ్ నోయెల్ సీన్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, నిహాల్ కోద‌ర్తి, అజ‌య్ క‌తుర్వ‌ర్, గీతా భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, సాదియ‌ కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. ఐదు క‌థ‌ల స‌మాహారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు.

    ప్ర‌స్తుతం ఈ చిత్రం తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ మూవీకి భారీగా రెస్పాన్స్ లభించింది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల పంచతంత్ర కథలపై ప్రశంసలు గుప్పించారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు కే రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమా వీక్షించి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ..

    ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న పంచతంత్ర కథలు మూవీ చూశాను. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఒకరే. అందుకే చాలా అద్భుతమైన చిత్రీకరించారనే ఫీలింగ్ నాకు కలిగింది. మంచి కథలు, కథకు తగినట్టుగా లొకేషన్స్, మ్యూజిక్, మాటలు, సెలక్షన్‌ ఆఫ్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చక్కగా కుదిరింది అని అన్నారు.

    Director K Raghavendra Rao appreciates Panchatantra Kathalu movie

    పంచతంత్ర కథలు సినిమాలో కుల వ్యవస్థ గురించి, ప్రేమకు కులాలు అడ్డురావు అనే అంశాన్ని చాలా సున్నితంగా తెరపైన చెప్పారు. మెలోడ్రామా లేకుండా చాలా చక్కగా తీశారు. నటీనటులు కూడా పాత్రల్లో ఒదిగిపోయారు. కచ్చితంగా ప్రతీ ఒక్కరు చూడాల్సిన చిత్రం ఇది అని రాఘవేంద్రరావు తెలిపారు.

    అహల్య అనే మరో షార్ట్‌ స్టోరీలో..తన బిడ్డను పోషించుకోవడం కోసం వ్యభిచారిణిగా మారిన అమ్మాయి, పెయింటర్‌ మధ్య జరిగే ఎపిసోడ్‌ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అందులో హీరో, హీరోయిన్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. హృదయానికి హత్తుకునేలా చిన్న చిన్న మాట‌ల‌తో చాలా చ‌క్క‌గా చిత్రీకరించాడు ద‌ర్శ‌కుడు అని రాఘవేంద్రరావు రివ్యూ చేశారు.

    త‌రుణ్ భాస్క‌ర్ త‌ల్లి గీతా భాస్క‌ర్‌ నటన బాగుంది. వృద్దాప్యంలో ఇద్ద‌రు కొడుకుల్లో ఎవరి వద్ద ఉండాలనే పాయింట్‌ను ఎంతో సున్నితంగా, ఆలోచింప‌జేసే విధంగా తీశారు. పంచ‌తంత్ర క‌థ‌లు అని పేరు పెట్టినందుకు ఐదు చ‌క్క‌టి క‌థ‌ల్ని అందించారు. కమర్షియల్ అంశాలను పట్టించుకోకుండా నిర్మాత మ‌ధు సినిమాను నమ్మారు. ఈ సినిమా మ‌రింత మంచి విజ‌యం సాధించి మునుముందు ఇంకా మంచి సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నా..అలాగే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌, మిగ‌తా ఆర్టిస్టుల‌కి కూడా మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు పంచ‌తంత్ర క‌థ‌లు టీమ్‌ అని అన్నారు.

    నటీనటులు: నోయెల్ సీన్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ త‌దిత‌రులు
    నిర్మాణ సంస్థ‌: మ‌ధు క్రియేష‌న్స్‌
    నిర్మాత‌: డి. మ‌ధు
    ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్‌
    సంగీతం: క‌మ్రాన్‌
    కో ప్రొడ్యూస‌ర్‌: డి. ర‌వీంద‌ర్‌
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పాల‌కూరి సాయికుమార్‌
    మాట‌లు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: అజ‌ర్ షేక్‌
    సినిమాటోగ్ర‌ఫి: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌
    ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి
    కాస్టూమ్ డిజైన‌ర్, స్టైలిస్ట్‌: రితీషా రెడ్డి
    సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి
    లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌, కాస‌ర్ల శ్యాం, మామా సింగ్‌
    పీఆర్వో: శ్రీను దుద్ది, సిద్ధు

    English summary
    Director K Raghavendra Rao appriciates Panchatantra Kathalu movie. This movie is combination of five stories with Heartbreaking content. Panchatantra Kathalu is streaming on AHA OTT.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X