Virupaksha 2: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సీక్వెల్‌పై డైరెక్టర్ క్లారిటీ.. ఓటీటీలో అలా రిలీజ్!
మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా నుంచి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టి సుప్రీమ్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అనేక చిత్రాల్లో నటించి సాయి ధరమ్ తేజ్ కు హిట్ అందించిన చిత్రాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అయినా ఎప్పటికప్పుడు తనను మార్చుకుంటూ సరికొత్త పంథాలో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అలా చేసిన చిత్రమే విరూపాక్ష. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతున్న ఈ మూవీ సీక్వెల్ పై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అనంతరం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఎక్కువగా ఫ్లాప్స్ నే చవిచూశాడు. అయినా డిఫరెంట్ వేలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.

ఇక తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం విరూపాక్ష్. తేజ్ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాతో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో మలయాళ బ్యూటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా, ముద్దుగుమ్మ సోనియా సింగ్ ఫీమెల్ లీడ్ రోల్ చేసింది. సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించిన సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా తాజాగా అంటే ఏప్రిల్ 21న శుక్రవారం విడుదలైంది.
విరూపాక్ష సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు కార్తిక్ వర్మ దండు. "విరూపాక్ష సీక్వెల్ అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పుకుండా సీక్వెల్ ఉంటుంది. కానీ, వెంటనే రాకపోవచ్చు" అని కార్తిక్ తెలిపారు. అలాగే ఈ సినిమాలో ఉన్న రెండు పాటల్లో కేవలం ఒకటి మాత్రమే థియేటర్ లో ఉందన్న ప్రశ్నకు.. ఆ పాటను ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు చేర్చుతామని, థియేటర్ లో థ్రిల్ మిస్సవ్వకూడదనే ఉద్దేశంతోనే తొలగించినట్లు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన విరూపాక్ష సినిమాకు మరో సీక్వెల్ రానున్నట్లు దర్శకుడి మాటల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా లాగే థియేటర్లలో విరూపాక్ష 2ను అనుభూతి చెందనున్నారు ప్రేక్షకులు. కాగా సాయి ధరమ్ తేజ్ వినోదయ సీతమ్ అనే రీమేక్ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా నటిస్తున్నారని టాక్.


Click it and Unblock the Notifications











