Unstoppable 2: బాలకృష్ణకు లేని ఆ గొడవ.. అలా కష్టమన్న పవన్ కల్యాణ్.. సీక్రెట్ బయటపెట్టించిన క్రిష్!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా అదరగొడుతున్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఫినాలేకు స్పెషల్ గెస్టుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. మిగతా వాటికంటే దీన్ని బాప్ కా ఎపిసోడ్ అంటూ ఆహా టీమ్ తెగ ప్రచారం చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే పవన్ ఎపిసోడ్ ఫస్ట్ పార్టు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రెండో పార్టుకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఫిబ్రవరి 9న రెండో పార్టును విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కు కష్టం, సులభమైన విషయాలను డైరెక్టర్ క్రిష్ బయటపెట్టాడు.

ఆసక్తికర అంశాలతో..

ఆసక్తికర అంశాలతో..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్టును ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు ప్రసారం చేయగా.. దానికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ మొదటి సారి ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా కలుసుకున్నారో తెలిపారు. మూడు పెళ్లిళ్లు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారు. అసలు సుస్వాగతం మూవీ తర్వాత సినిమాలు ఎందుకు చేయనని అన్నారు, పవన్ ఫామ్ హౌజ్, త్రివిక్రమ్ కథ చెప్పడం గురించి పలు ఆసక్తికర అంశాలను చర్చించారు.

నాకు ఇప్పుడు అర్థమైంది..

నాకు ఇప్పుడు అర్థమైంది..

పవన్ ఎపిసోడ్ మొదటి పార్టుకు వచ్చిన జోరుతో రెండో పార్టును తాజాగా అంటే ఫిబ్రవరి 9న విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో అనేక విషయాలు చర్చించిన అనంతరం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఎంట్రీ ఇచ్చారు. తను రాగానే ఎలా ఉంది అని బాలయ్య అడిగితే.. ఒక సింహం.. ఒక పులి మధ్యలో నా తల ఉంది సార్ అని క్రిష్ చెప్పారు. అలాగే త్రివిక్రమ్ గారు ఎందుకు తప్పించుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అని డైరెక్టర్ క్రిష్ అందరినీ నవ్వించారు.

మెథడ్ యాక్టర్ అంటే పవన్..

మెథడ్ యాక్టర్ అంటే పవన్..

అనంతరం ఇప్పుడు మా ఇద్దరితే పని చేశావ్ కదమ్మా.. డిఫరెన్స్ ఏంటీ అని బాలకృష్ణ అడిగారు. దానికి "సార్ బేసిక్ గా.. మీరు ఇద్దరూ కంప్లీట్ డిఫరెంట్. సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. దర్శకుడిగా డిఫరెన్స్ ఏంటో చెప్పాలంటే.. మీరు (బాలకృష్ణ) కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్. పవన్ కల్యాణ్ గారు కంప్లీట్ మెథడ్ యాక్టర్. గూగుల్ లో మెథడ్ యాక్టర్ అని సెర్చ్ చేస్తే ఏం వస్తాయో.. అవన్నీ పవన్ కల్యాణ్ గారిలో ఉన్నాయి. ఎప్పుడూ క్యారెక్టర్ మూడ్ లో ఉంటారు. ఆయనకు అలా ఉండటం చాలా కష్టమే" అని క్రిష్ చెప్పారు.

బాలకృష్ణ క్లాసికల్ యాక్టర్..

బాలకృష్ణ క్లాసికల్ యాక్టర్..

"పవన్ కల్యాణ్ గారు క్యారెక్టర్ లో, ఆ మూడ్ లో ఉన్నప్పుడు కొన్ని షాట్స్ తీసుకోవాలి. అప్పుడు చుట్టూ ఎక్కువ కెమెరాలు ఉపయోగిస్తాం. మెథడ్ యాక్టింగ్ కి అపోజిట్ క్లాసికల్ యాక్టింగ్. గూగుల్ లో క్లాసికల్ యాక్టింగ్ అని టైప్ చేస్తే బాలకృష్ణ గారు. డైరెక్టర్ చెప్పినదానికి స్క్రిప్టులో రాసిన దానికి బాలకృష్ణ ఇంప్రవైజ్ చేస్తారు. నేను షాట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని చాలా సార్లు చూశా. కట్ చెప్పిన తర్వాత కత్తిని గాల్లో ఎగరవేసుకుంటూ వస్తారు. డిస్కో డ్యాన్స్ చేస్తూ వెళతారు" అని క్రిష్ పేర్కొన్నారు.

దర్శకులు జాగ్రత్తగా ఉండాలి..

దర్శకులు జాగ్రత్తగా ఉండాలి..

"యాక్టింగ్ విషయానికొస్తే మీరు (బాలకృష్ణ), పవన్ కల్యాణ్ గారు చాలా డిఫరెంట్. దాన్ని దర్శకులు అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి" అని క్రిష్ వివరించారు. దీంతో "ఎప్పుడూ సీరియస్ గా ఉండాలి. క్యారెక్టర్ మూడ్ లో ఆ విధంగా ఉండాలి.. నాకు ఆ గొడవ లేదు" అని బాలయ్య అంటే.. వెంటనే "చాలా కష్టం సార్. అందరికీ అలా కుదరదు" అని పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు "నాకు అలా సెట్ అయిందమ్మా" అని బాలకృష్ణ టాపిక్ ను ముగించారు.

ఒకరి అభిమాని ముద్ర వేయకండి..

ఒకరి అభిమాని ముద్ర వేయకండి..

అనంతరం మాట్లాడే క్రమంలో.. "నువ్వు ఫ్యాన్స్ మధ్య గొడవలు పెడుతున్నావ్" అని బాలయ్య అంటే.. "నేను ఇద్దరికీ అభిమానిని. సమర సింహా రెడ్డికి బ్యానర్లు కట్టాను. తొలి ప్రేమ చిత్రానికి బ్యానర్లు కట్టాను. నాపై ఒకరి అభిమాని ముద్ర వేయకండి" అని డైరెక్టర్ క్రిష్ తెలిపారు. ఆ తర్వాత అభిమానుల మధ్యకు వెళ్లి కూర్చున్నారు క్రిష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X