OTT: నెలకాకముందే సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?

Peddha Kapu 1 OTT Streaming: ఓటీటీలోకి మరో కొత్త చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ప్రకటన లేకుండా... సడెన్ గా ఓటీటీలో ఓ సినిమా ప్రత్యక్ష్యం అయిపోయింది. అదేంటో కాదు.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటకల్ థ్రిల్లర్ పెద్ద కాపు 1 సినిమా. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ సినిమా సందడి చేస్తోంది. ఈ సినిమా కథేంటి.. సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శ్రీకాంత్ అడ్డాల అనగానే మనకు గుర్తుకువచ్చే చిత్రాలు కొత్త బంగారు లోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. బ్రహ్మోత్సవం దెబ్బకు ఆయన రూటు మార్చిన విషయం తెలిసిందే. ఇక సీరియల్ లాగా ఉందంటూ బ్రహ్మోత్సవం సినిమాపై కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం చెందింది.

Director Srikanth Addala Peddha Kapu 1 Movie Streaming Now on Amazon Prime Video OTT

ఇక బ్రహ్మోత్సవం దెబ్బకు శ్రీకాంత్ అడ్డాల... తనలోని మరో రూపం బయటకు తీశాడు. వెంకటేష్ తో నారప్ప సినిమా తీసి హిట్ కొట్టాడు. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకుని.. పెదకాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీ రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ట్రైలర్ చూశాక.. సినిమాపై రెట్టింపు అంఛనాలు పెరిగాయి.

ఇక పెదకాపు సినిమాను తెరకెక్కించడమే కాకుండా ఆయన ఈ సినిమాలో విలన్ గా సరికొత్త రోల్ పోషించారు. తనలోని యాక్టింగ్ యాంగిల్ సైతం బయటకు తీశాడు. పెదకాపు సినిమాలో విరాట్ కర్ణా హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఆయన సరసన కొత్త హీరోయిన్ ప్రగతి శ్రీవాత్సవ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కూడా మరో కీలక పాత్రలో నటించింది. ఇక ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అయితే మొదటి భాగం సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ అయింది. ఇక పోలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆదరణ దక్కింది. దళిత వర్గాలు ఎలా అణచివేతకు గురువుతున్నారన్న సున్నితమైన అంశంపై ఈ మూవీ తెరకెక్కగా... మిక్స్ డ్ టాక్ లభించింది. వసూళ్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయి. ఇక రెండో భాగం త్వరలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

పెద కాపు సినిమాలో రావు, రమేష్‌, తనికెళ్ల భరణి, నాగేంద్ర బాబు, బ్రిగిడ సాగా, రాజీవ్‌ కనకాల, అనసూయ భరద్వాజ్‌, ఈశ్వరి రావు, అడుక్కలం నరేన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ద్వారాకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై అఖండ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్ గా ఓటీటీలో ప్రత్యేక్షం అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియో పెద కాపు శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను మీరు థియేటర్లలో మిస్ అయితే కనుగ.. ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X