హాట్ బ్యూటీకి అన్యాయం .. ఓటీటీలో ఆ సీన్స్ అన్నీ కట్, ఏ సినిమాకి అంటే
చిత్ర పరిశ్రమలో అందరి హీరోయిన్స్ కి ఒకేలాంటి మార్క్ ఉండదు అని చెప్పాలి. కొంతమంది గ్లామర్ వరకు పరిమితం అయితే కొందరు పెర్ఫామెన్స్ వరకు పరిమితం అయ్యి ఎక్స్ పోజింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటారు. ఐతే ఇంకొందరు ఈ రెండు కూడా బ్యాలన్స్ చేస్తూ సినీ పరిశ్రమలో రాణిస్తారు. కాగా ఇపుడు సౌత్ నుంచి కొందరు హీరోయిన్స్ నార్త్ కి వెళుతుంటే నార్త్ నుంచి కొందరు హీరోయిన్స్ మన దగ్గర పాగా వెయ్యాలని ఆసక్తి కనబరుస్తున్నారు.
కాగా ఇలా హిందీ సినిమా నుంచి వచ్చి సౌత్‌లో పాపులర్ అయ్యిన హాట్ బ్యూటీస్‌లో గ్లామరస్ హీరోయిన్ దిశా పటాని కూడా ఒకామె అని చెప్పాలి. దిశా పటాని ఈ ఏడాదిలోనే తెలుగు సహా తమిళ్‌లో రెండు చిత్రాలతో పలకరించింది. తెలుగులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ "కల్కి 2898 ఎడి"లో కనిపిస్తే తమిళ్ ఇండస్ట్రీలో సూర్య నటించిన భారీ చిత్రం "కంగువా" సినిమాలో ఈమె కనిపించింది.

మరి ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు చిత్రాల్లో కూడా దిశా పటానిని కేవలం తన అందాలు చూపించడం వరకే పరిమితం చేసేసారు అని సినిమాలో ఆమెకి అన్యాయం జరిగిందనే టాక్ వినిపించింది. అయితే సూర్య సినిమాలో మాత్రం ఆమె కనిపించింది చాలా తక్కువ సేపు అయినప్పటికీ భారీ రెమ్యునరేషన్‌ని అందుకున్నట్టుగా టాక్ .
ఈ సినిమా విడుదల తర్వాత ఆమె కోసం కొంచెం చర్చలు కూడా జరిగాయి. ఇపుడు ఫైనల్‌గా ఈమెకి ఇదే కంగువా సినిమా విషయంలో మళ్ళీ అన్యాయం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ సినిమాలో ఆమె ఉన్నదే చాలా తక్కువసేపు.. కాకపోతే ఒక్క సాంగ్ లో మాత్రం ఓ రేంజ్ లో హీటెక్కించింది. ఇలా దిశా పటానిని వాడుకుంటే సినిమా విడుదలై నెల కూడా పూర్తి కాకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

పాపులర్ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్‌గా పాన్ సౌత్ భాషల్లో వచ్చిన ఈ చిత్రంలో దిశా పటానికి మేకర్స్ షాకిచ్చారు. సినిమా ఫస్టాఫ్ లో ఆమెపై ఉండే సాంగ్ మొత్తాన్ని లేపేశారు. దీనితో మళ్ళీ దిశాకి అన్యాయం జరిగింది అని టాక్ ఇపుడు వినిపిస్తుంది. అలాగే దిశా పటాని ఫ్యాన్స్ కూడా ఒకింత హర్ట్ అయ్యారు. ఆమె అందాలు అన్నీ ఓ రేంజ్ లో కనిపించేది ఆ ఒక్క సాంగ్ లోనే. అలాంటిది ఆ పాట మొత్తాన్ని ఓటిటి వెర్షన్‌లో తొలగించడం చర్చనీయాంశమైంది.
ఈ ఊహించని పరిణామంతో దిశా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. థియేటర్స్‌లో కూడా కొంచెం రన్ టైంని తగ్గిస్తే బాగుణ్ణు అని కొన్ని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇపుడు ఓటిటిలోకి వచ్చాక ఈ సాంగ్ తో పాటుగా ఇంకొన్ని సీన్స్ తీసేసి విడుదల చేశారట. కంగువాకి శివ దర్శకత్వం వహించగా సూర్య తమ్ముడు కార్తీ ఈ సినిమాలో క్యామియో చేసాడు . అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్‌లో అలరించారు.


Click it and Unblock the Notifications











