Yodha దిశా పటానీ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? రాశీ ఖన్నా మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్, హిరూ యాష్ జోహర్, అపూర్వ మెహతా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం యోధ. ఈ సినిమాకు సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా, రాశీ ఖాన్నా, దిశా పటానీ, రోనిత్ రాయ్ తదితరులు నటించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే..

యోధ సినిమాను తొలుత థియేట్రికల్ రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఓటీటీ నిబంధనల కారణంగా చివరకు థియేట్రికల్ రిలీజ్ చేయడం తప్పనిసరిగా మారింది. ఈ సినిమాను 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటు పలికింది. సుమారుగా 20 కోట్ల మేర ఓటీటీ రైట్స్ రూపంలో లభించినట్టు సమాచారం.

Yodha

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు జిష్ణు భట్టాచార్జి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఎడిటింగ్ శివకుమార్ వీ పానికర్ చేశారు. ఇక ఈ మూవీకి విశాల్ మిశ్రా, తానిష్క్ బాగ్చి, పీ ప్రాక్, జానీ, ఆదిత్య దేవ్ సంగీత సహకారం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోరును జాన్ స్టీవార్డ్ ఎడూరి అందించారు.

రాశీ ఖాన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 15వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీని అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా బాలీవుడ్‌లో 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన ఉంది. అయితే ఈ సినిమా సక్సెస్‌ను బట్టి ఓటీటీ డేట్ ఫిక్స్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X