Mahabharat series ను ప్రకటించిన డిస్నీ+హాట్ స్టార్.. అల్లు అరవింద్, మధు మంతెన నిర్మాతలుగా భారీ ప్రాజెక్టు!

వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి అంటారు పెద్దలు. అయితే మహాభారతంలోని భావోద్వేగమైన సంఘటనల ఆధారంగా ఎన్నో చిత్రాలు వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. ఎంతో మంది సినీ ప్రముఖులు, దర్శకులు అద్బుతమైన కథలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. తాజాగా మహాభారతం పౌరాణిక కథను మరోసారి బుల్లితెరపై ఆవిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సిద్దమయ్యారు. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

ఇండియన్ ఓటీటీ చరిత్రలో కనివిని

ఇండియన్ ఓటీటీ చరిత్రలో కనివిని

ఇండియన్ ఓటీటీ చరిత్రలో కనివిని ఎరుగని అతిపెద్ద ప్రాజెక్ట్‌ను ప్రఖ్యాత డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్‌ను భారీగా విస్తరించే క్రమంలో అల్లు ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రోవెర్స్ స్టూడియోస్‌తో కలిసి భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. ఓటీటీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అయింది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మహాభారత్

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మహాభారత్

D23 Expo కార్యక్రమంలో మహభారత్ ప్రాజెక్టును ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై తీసుకొస్తున్నామని డిస్నీ హాట్ స్టార్ సంస్థ ప్రకటించింది. భారీ ప్రొడక్షన్‌గా మహాభారత్‌ను రూపొందిస్తున్నాం. ఈ ప్రాజెక్టును ప్రకటించడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాం. మా నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాం అని డీస్నీ హాట్ స్టార్ ప్రకటించింది.

ఎవరూ చెప్పని విధంగా మహాభారత్

ఎవరూ చెప్పని విధంగా మహాభారత్

మహాభారత్ ప్రాజెక్టు గురించి డిస్నీ+హాట్ స్టార్ సెప్టెంబర్ 10వ తేదీన ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు చరిత్రలో ఎవరూ చెప్పని విధంగా అద్బుతమైన పౌరాణికి గాథను చెప్పబోతున్నాం. త్వరలోనే మహాభారత్ మీ ముందుకు వస్తుంది అని ట్వీట్‌లో తెలిపింది. అంతేకాకుండా మహాభారత్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామ్యంతో

అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామ్యంతో

మహాభారతం సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ తమ కార్యచరణను ప్రారంభించింది. భారీ ప్రాజెక్టుపై అల్లు ప్రొడక్షన్ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యం కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ తెలిపింది.

మహాభారత్‌ను అద్బుతంగా తీర్చిదిద్దేందుకు

మహాభారత్‌ను అద్బుతంగా తీర్చిదిద్దేందుకు

గతంలో 80 దశకంలో బీఆర్ చోప్రా మహాభారతం సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రసారం చేయగా.. దేశవ్యాప్తంగా అద్బుతమైన స్పందన లభించింది. అప్పట్లో రేటింగ్ పరంగా రికార్డులు తిరిగరాసింది. టెక్నాలజీ అభివ‌ృద్ధి చెందని సమయంలోనే మహభారతం సీరియల్‌ను సొంతం చేసుకొన్నారు. టెక్నాలజీ, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అభివృద్ది చెందిన ఈ సమయంలో మరోసారి మహాభారత్‌ను అద్బుతంగా తీర్చిదిద్దేందుకు డిస్నీహాట్ స్టార్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ సిద్దమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X