OTT డిస్నీ+ హాట్ స్టార్‌లో ట్రెండింగ్‌గా టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. వీటిని మీరు చూశారా?
వినోద పరిశ్రమలో థియేటర్లే కాకుండా ఓటీటీ (OTT) ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులకు పంట పడుతుంది. థియేటర్‌కు వెళ్లి చూడలేని ప్రేక్షకులకు, అలాగే ఓసారి వెండితెర పొందిన అనుభూతిని మళ్లీ పొందాలనుకొనే ఆడియెన్స్‌కు ఓటీటీలు ఓ వరంలా మారాయి. థియేటర్‌లో సత్తా చాటినా.. సిల్వర్ స్క్రీన్‌పై మీద రాణించలేకపోయిన సినిమాలు ఓటీటీలో సత్తా చాటుతుండటం మనం గమనిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డిస్నీ+హాట్ స్టార్ (Disney+Hotstar) ఓటీటీ యాప్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాల్లోకి వెళితే..
ప్రముఖ డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో ఇండియన్ సినిమాలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న సినిమాల్లో స్కంధ, పొలిమేర, మాన్షన్ 24, కింగ్ ఆఫ్ కోతా, లోకి, అఖండ, మాస్టర్ పీస్, డోరేమాన్, అతిథి, వీర సింహారెడ్డి ఉన్నాయి. ఈ టాప్ 10 సినిమాలు భారీ వ్యూస్ అందుకొంటున్నాయి.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన స్కంధ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. తొలి వారంలో సాధించిన కలెక్షన్లను రెండో వారం వరకు కొనసాగించలేకపోయింది. దాంతో వసూళ్ల పరంగా కొంత నిరాశకు గురిచేసింది. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ (Disney+Hotstar) ఓటీటీలో నెంబర్ వన్ స్థానంలో నిలవడం రికార్డుగా మారింది.
ఇక డిస్నీ+హాట్ స్టార్ (Disney+Hotstar) ఓటీటీలో రెండో స్థానంలో నిలిచిన వాటిలో మా ఊరి పొలిమేర వెబ్ సిరీస్. ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా మా ఊరి పొలిమేర 2 రావడంతో పొలిమేర 1కు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో అనూహ్యంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అలాగే 3వ స్థానంలో ఓంకార్ దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన మాన్షన్ 24 సినిమా ట్రెండ్ అవుతున్నది.

డిస్నీ+హాట్ స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వాటిలో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోతా 4వ స్థానంలో నిలిచింది. టామ్ హిండల్ సన్, సోఫియా, ఓవెన్ విల్సన్, జోనాథన్ మేయర్ నటించిన లోకి (Loki) వెబ్ సిరీస్ ఐదో స్థానంలో, నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం 6వ స్థానంలో ట్రెండ్ అవుతున్నది.

ఇక డిస్నీహాట్ స్టార్ యాప్‌లో ట్రెండ్ అవుతున్న వాటిలో మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ కూడా ఉంది. నిత్య మీనన్, దివ్య పిళ్లై తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ 7వ స్థానంలో నిలిచింది. ఎనిమిదో స్థానంలో డోరేమాన్ కార్టూన్ సిరీస్, 9వ స్థానంలో తెలుగు వెబ్ సిరీస్ అతిథి ఉన్నాయి. ఇక 10వ స్థానంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి కూడా టాప్ లేపడం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











