డిస్నిప్లస్ సంచలన నిర్ణయం.. భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు అన్నీ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. భారీ స్థాయిలో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు కొంతమంది అనవసరం అనుకున్న ఉద్యోగులను ఎదో ఒక కారణంతో తొలగిస్తున్నట్లుగా అధికారిక ప్రకటనలు కూడా చేస్తోంది. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కూడా చాలా కంపెనీలు ఇప్పుడు నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక వరల్డ్ వైడ్ గా మంచి ఫాలోవర్స్ కలిగిన డిస్నీ కంపెనీ కూడా ఇప్పుడు ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతోంది. మొత్తం ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 7,000 మంది కార్మికులను తొలగించాలి అని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. డిస్నీ కంపెనీ ఇటీవల కాలంలో అయితే చాలావరకు సబ్ స్క్రిబర్ లు తగ్గిపోయారు. దీంతో సీఈవో ఈగర్ బుధవారం ఒక మీటింగ్ లో మనం ఎదుర్కొంటున్న సవాలను పరిష్కరించడానికి ఈ చర్య తప్పనిసరిగా అవసరం అవుతుంది అని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని అనేక కంపెనీల మాదిరిగానే ఇప్పుడు డిస్నీ లో కూడా ఆర్థిక సంక్షోభం వలన ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది అని అందుకే ఉద్యోగులను తీసివేసేందుకు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.. ఇటీవల కాలంలో అయితే డిస్నీ ప్రపంచ వ్యాప్తంగా 5.5 బిలియన్ల డాలర్స్ వరకు పొదుపు చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. ఉద్యోగులను తీసివేస్తే చాలావరకు ఆధారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
ఆర్థిక సంక్షోభం వలన జనాలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పై కూడా కాస్త దృష్టి తక్కువ చేశారు. సబ్ స్క్రిబర్స్ చాలా వరకు తగ్గుతున్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేదేమీ లేక ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం అది కొద్ది కాలంలోనే మిలియన్ల వ్యవధిలో సబ్ స్కైబర్స్ సంఖ్యా తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇక డిస్నీకి చెందిన హాట్ స్టార్ మినహా మిగతా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఛానల్స్ కు భారీగానే ఆఫర్లు ప్రకటించినప్పటికీ సబ్ స్కైబర్స్ ఎక్కువ స్థాయిలో అయితే ఇటువైపు గా చూడడం లేదు. గతంలో 4 బిలియన్ డాలర్స్ కు పైగా భారం పడింది. ఇక ఆ ఆలోచనతో ఉద్యోగుల తొలగింపుతో ఇప్పటివరకు 1.2 రెండు బిలియన్ల వరకు నష్టాలను తగ్గించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











