twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరంపర సీజన్ 1 వెజ్ థాలి.. పరంపర 2 నాన్‌వెజ్ మీల్స్.. డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

    |

    ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ పరంపర సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ఎల్ కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ కొత్త సిరీస్ జూలై 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.

    ఈ సందర్భంగా దర్శకుడు అరిగెల విశ్వనాథ్ మాట్లాడుతూ...పరంపర 2 సీజన్‌లో మరింత యాక్షన్, డ్రామాను చూస్తారు. గోపీ పాత్రలో నవీన్ చంద్ర పెర్మార్మెన్స్ మరింతగా ఆకట్టుకుంటుంది. రెండేళ్ల కిందట నుంచి ఈ వెబ్ సిరీస్ ప్లానింగ్ లో ఉన్నాం. ఫైనల్‌గా ఇప్పుడు సెకండ్ సీజన్ తో మీ ముందుకు వస్తున్నాం. నవీన్ చంద్ర క్యారెక్టర్ మాత్రమే కాదు శరత్ కుమార్, జగపతిబాబు, రవివర్మ, ఆకాంక్ష సింగ్, దివి ..ఇలా వీరందరి క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. ఆర్కా మీడియాకు బాహుబలి 2 ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో, పరంపర 2 కూడా అంతే పెద్ద సక్సెస్ అవ్వాలి అని అన్నారు.

    నటుడు రవి వర్మ మాట్లాడుతూ...పరంపర 2 వెబ్ సిరీస్ లో మంచి క్యారెక్టర్ చేశాను. ఒక నటుడికి కావాల్సింది సహ నటుల ప్రోత్సాహం. నవీన్ చంద్ర నుంచి నాకు ప్రతిసారీ అలాంటి ప్రోత్సాహం అందుతూనే ఉంది. అతనితో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశాను అని అన్నారు.

    Divi Vadhthyas Parampara 2 season to release on july 21st on Disney Hotstar

    నటి బిగ్ బాస్ దివి వద్యా మాట్లాడుతూ...నా క్యారెక్టర్ ఇందులో స్పెషల్ గా ఉంటుంది. వెబ్ సిరీస్ చివరలో నా పాత్ర ఇంపార్టెంట్స్ ఏంటో తెలుస్తుంది. బిగ్ బాస్ తర్వాత మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్న సమయంలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ నుంచి ఈ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. ఇది నాకు మంచి గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నాను అని చెప్పింది.

    హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ...రచన అనే పాత్రలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో నేను నటించిన చిత్రాలు కొన్నే. అయినా నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ఆర్కా మీడియాకు థాంక్స్. నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలా ఎమోషన్స్, వేరియేషన్స్ ఉన్న పాత్ర నాది. నటించకుండా నేనే రచన అనుకుని నటించాను. పరంపర 2 అంటే గోపీ, రచన మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది, వెబ్ సిరీస్ లో చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పింది.

    హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ...పరంపర సీజన్ 1 వెజ్ థాలి అయితే, పరంపర 2 నాన్ వెజ్ మీల్స్. మరింత డ్రామా, యాక్షన్, రివేంజ్ చూస్తారు. సీజన్ 2 స్ట్రీమింగ్‌కు కొద్ది రోజులే ఉంది. కాబట్టి మొదటీ సీజన్ చూసేయండి, అప్పుడు మీకు సెకండ్ సీజన్ క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ సీజన్ లో మీక ఏ అంశాలైతే మిస్ అయ్యాయి అనిపించాయో, వాటికి సీజన్ 2 లో సమాధానం దొరుకుతుంది. అన్నారు.

    English summary
    Parampara season 1 gets successful response for all conrners. Now, Parampara season 2 set to release on july 21st on Disney Hotstar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X