2 వారాలకే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ మూవీ.. బిగ్ బాస్ బ్యూటీ సూపర్ సర్‌ప్రైజ్
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్లుగా నిలదొక్కుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది దివి వాధ్యా ఒకరు. చాలా కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న ఈ బ్యూటీ ఇటీవలే 'లంబసింగి' అనే సినిమాతో వచ్చింది.
దివి వాధ్యా, భరత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నవీన్ గాంధీ తెరకెక్కించిన చిత్రమే 'లంబసింగి'. క్యూట్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కూడా ప్రచార చిత్రాలతో మరింత మందికి చేరువ అయింది. ఇలా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ఈ మూవీ మార్చి 15వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

ఎన్నో అంచనాలు, ఆశల నడుమ విడుదలైన 'లంబసింగి' మూవీకి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన చాలా తక్కువగా లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. మొత్తానికి ఇది రెండు వారాలకే థియేటర్లలో రన్‌ను ముగించాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి.
దివి వాధ్యా - భరత్ రాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'లంబసింగి' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ మంచి మొత్తాన్ని నిర్మాతలకు అందించింది. ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగినా.. తాజాగా హాట్‌స్టార్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.

పూర్తి స్థాయి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'లంబసింగి' మూవీని ఏప్రిల్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ క్యూట్ పోస్టర్‌ను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక, ఈ ప్రకటనతో దివి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. దివి వాధ్యా, భరత్ రాజ్ జంటగా నటించిన 'లంబసింగి' మూవీని కాన్సెప్టు ఫిలింస్ బ్యానర్‌పై ఆనంద్ తన్నీరు నిర్మించారు. ఇందులో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











