OTT: ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం "క" .. కొత్త ఫార్మాట్ లో ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?
కొన్ని సినిమాలు చిన్నా పెద్దా అనే మేటర్ పక్కన పెడితే అందులో ఉండే కంటెంట్ వాటిని మరో స్థాయికి తీసుకెళ్లి ఒక పాత్ బ్రేకింగ్ జాబితాలో నిలుస్తాయి. మారే కాలం కొద్దీ ట్రెండ్ తో పాటుగా పలు కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త జానర్ లో థ్రిల్ చేస్తూనే ఉంటాయి. అలా మన తెలుగు సినిమా దగ్గర కూడా ఎన్నో సినిమాలు డిఫరెంట్ స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్ లతో థియేటర్స్ లో ఆడియెన్స్‌కి ఒక మైండ్ బ్లాకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయి.
అలా ఇటీవల తెలుగు నుంచి వచ్చిన ఓ పాత్ బ్రేకింగ్ హిట్ చిత్రమే "క". యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రం తన నుంచి చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. అప్పుడు వరకు వరుస సినిమాలు చేస్తూ ట్రోల్స్ కి గురైన ఈ యువ హీరో వాటి అన్నిటికి సమాధానం చెప్పాలి అన్నట్టుగా చేసిన ఈ చిత్రం మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ లతో వచ్చి ఆడియెన్స్ కి థియేటర్స్ లో దిమ్మ తిరిగే ట్రీట్ ని ఇచ్చింది.

ఈ సినిమా విడుదలకి ముందు హీరో కిరణ్ అబ్బవరం చెప్పిన మాట పొల్లు పోకుండా క్లైమాక్స్ నిజంగానే ఈ సినిమాకి, అలాగే కిరణ్ కెరీర్ కి కూడా 'ప్రాణం పోసింది'. ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దీపావళి సీజన్లో పెద్దగా థియేటర్స్ దొరక్కపోయినప్పటికీ ఉన్న వాటిలో క ర్యాంప్ అంటే ఏంటో చూపించింది. మరి థియేటర్స్‌లో అన్ని అంచనాలు అందుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలో వస్తుంది? అసలు ఈ సినిమా ఓటిటి హక్కులు ఎవరు దక్కించుకున్నారు? అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు.
ఇపుడు ఫైనల్ గా "క" సినిమా ఓటిటి విడుదలపై బిగ్ న్యూస్ రివీల్ అయ్యింది. నిన్నటి నుంచే హింట్ ఇస్తూ వస్తున్న ఈ సినిమాని తెలుగు స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్ వాళ్ళు స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. తెలుగులో ఈ సినిమా వచ్చే వారం అంటే నవంబర్ 28 నుంచి ఓటిటి వీక్షకులని అలరించేందుకు వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
ఇంతే కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ చిత్రాన్ని మేకర్స్ ఓటిటి వెర్షన్ లో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ ఫార్మాట్ లో విడుదల చేస్తుండడం విశేషం. ఈ ఫార్మాట్స్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా రాలేదు. మరి ఈ చిన్న చిత్రాన్ని బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు తీసుకొస్తున్నామని ఈటీవీ విన్ వాళ్ళు చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన "ఆయ్" బ్యూటీ నయన్ సారిక నటించగా ఈ హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ చిత్రాన్ని దర్శకులు సుజీత్, సందీప్ లు తెరకెక్కించారు. ఇంకా ఈ నవంబర్ 22నే మలయాళ వెర్షన్ లో థియేటర్స్ లో సినిమా విడుదలకి వచ్చింది.


Click it and Unblock the Notifications











