ఒకేరోజు దీపావళి థ్రిల్లర్స్ .. ఉత్కంఠ రేపే బాక్సాఫీస్ హిట్స్ ఏయే ఓటిటిల్లో చూడొచ్చంటే?
ఈ ఏడాదిలో తెలుగు సినిమా దగ్గర పండుగల సీజన్ ఓ రేంజ్‌లో హీటెక్కించింది అని చెప్పాలి. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి నుంచే సాలిడ్ సినిమాలు అది కూడా పలు కాంట్రవర్సీలు నడుమ విడుదలకి వచ్చాయి అని చెప్పాలి. ఇది ఒక్క సంక్రాంతికే కాకుండా తర్వాత ఉగాది, ఆగష్టు 15 రేస్ లు కూడా ఒకింత కాంట్రవర్సియల్ గానే జరిగాయి.
ఇలా టాలీవుడ్‌లో ఒక ఊహించని యుద్ధమే పలు సినిమా యూనిట్స్ నడుమ జరిగింది అని చెప్పాలి. ఈ సినిమాలు అన్నీ మన తెలుగు నుంచి వచ్చి హిట్ కాలేదు కానీ మొన్న దీపావళి కానుకగా వచ్చిన సినిమాలు మాత్రం టాలీవుడ్‌లో బిగ్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అని చెప్పాలి. నిజానికి ఈ ఏడాదిలో దాదాపు వచ్చిన అన్ని సినిమాలు కూడా అందులోని పోటీలో ఒకే రోజు వచ్చినవి కూడా సూపర్ హిట్ కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

ఈ ఫీట్ ని ఫైనల్ గా దీపావళి నాడు రిలీజైన సినిమాలు సెట్ చేసాయి. అయితే ఈ సినిమాల్లో మన తెలుగు నుంచి రెండు సినిమాలు "క" , "లక్కీ భాస్కర్" వచ్చాయి. ఒకటి యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "క" కాగా.. మరొకటి మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ చేసిన "లక్కీ భాస్కర్".
ఈ రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా థియేట్రికల్ కాంట్రవర్సీ ఎదుర్కొనే వచ్చాయి కానీ పోటీలోకి దిగి రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు అందించాయి. ఈ రెండు సినిమాలు మంచి ఉత్కంఠభరితంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే థ్రిల్ మోడ్ లో దర్శకులు తెరకెక్కించారు. థియేటర్స్ లో మంచి సక్సెస్ ని సాధించి ఓటిటిలో కూడా ఒకే రోజు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.

ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ హక్కులు చూస్తే "క" చిత్రాన్ని ఈటీవీ విన్ సొంతం చేసుకోగా, నెట్ ఫ్లిక్స్ లక్కీ భాస్కర్ ని సొంతం చేసుకుంది. లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా .. క మాత్రం కేవలం ఒకే ఒక్క భాషలో మాత్రమే వచ్చింది. అయితే ఈ సినిమా డాల్బీ వెర్షన్ లో రావడం జరిగింది.
ఇలా ఈ రెండు క్రేజీ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ దగ్గర పోటీ తర్వాత ఓటిటిలోనూ పోటీకి దిగడం విశేషం. నవంబర్ 28 నుంచే ఈ రెండు చిత్రాలు ఓటీటీలో అందుబాటులోకి రాగా ఈ సినిమాలు ఎలా అలరిస్తాయో చూడాలి. క సినిమాని ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ లు తెరకెక్కించగా.. లక్కీ భాస్కర్ ని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. అలాగే కిరణ్ అబ్బవరం సరసన ఆయ్ ఫేమ్ నయన్ సారిక నటించగా దుల్కర్ కి జోడీగా హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించింది.


Click it and Unblock the Notifications











