The Kerala Story OTT ఎట్టకేలకు ఓటీటీలో ది కేరళ స్టోరి.. అదా శర్మ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియన్ సినిమా పరిశ్రమలో 2023 సంవత్సరంలో భారీ విజయాన్ని అందుకొన్న సినిమాల్లో ది కేరళ స్టోరి ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వివాదాస్పదంగా మారడంతో మంచి బజ్ క్రియేట్ చేసుకొంటూ మే 5 తేదీన ఈ సినిమా రిలీజైంది. అదాశర్మ, యోగాతి బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సుదీప్టో సేన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ శర్మ నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ విషయంలో రకరకాల ఊహగానాలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా గురించిన విషయాలు, రిలీజ్ డేట్, ఇతర అంశాల గురించిన వివరాల్లోకి వెళితే..
షాలిని ఉన్నికృష్ణన్ అనే యువతి ఇస్లాం మతాన్ని స్వీకరిస్తుంది. ఆమె నర్స్ కావాలని కోరుకొంటుంది. ముస్లిం మిలిటెంట్లు స్నేహితులుగా మారి.. ఆమెను ఐస్లామిక్ స్టేట్ (ISIS) లో చేరేలా పురిగొల్పుతారు. ఆ తర్వాత అఫ్ఘనిస్థాన్‌లో బందీగా మార్చుతారు. ఆ తర్వాత ఏమైంది? ముస్లిం మిలిటెంట్ల బారి నుంచి ఎలా తప్పించుకొన్నది అనేది ది కేరళ స్టోరి సినిమా కథ.

నిషేధం, సినిమాను ప్రదర్శించకూడదు అనే రకరకాల వివాదాస్పద అంశాల మధ్య ది కేరళ స్టోరి సినిమా రిలీజైంది. తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లను రాబట్టింది. తొలి రోజు స్వదేశంలోనే 8 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ చిత్రం తొలివారమే 80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
ది కేరళ స్టోరి సినిమా దాదాపు థియేట్రికల్‌గా బాక్సాఫీస్ వద్ద లాంగ్ జర్నీ చేసింది. ఈ సినిమా దాదాపు 7 వారాలపాటు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలోనే 250 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. హిందీలో 245 కోట్లు, తెలుగులో సుమారుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిని ది కేరళ స్టోరి సినిమా డిజిటిల్ రైట్స్ కొనడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిరాకరించారు. సినిమా హిట్ అయిన తర్వాత ఓటీటీ రైట్స్ రేటు విషయంలో భారీగా చర్చలు జరిగాయి. కానీ రైట్స్ రేటు భారీగా ఉండటంతో చాలా సంస్థలు ఆ మొత్తాన్ని చెల్లించడానికి సిద్దం లేకపోవడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది.
ది కేరళ స్టోరి ఓటీటీ రిలీజ్ విషయంలో రకరకాల ఊహగానాలు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకొన్నది. ఈ సినిమాను ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని జీ5 నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. దాంతో ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అవ్వడానికి సిద్దం కావడంతో ఈ మూవీని చేసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తన్నారు.


Click it and Unblock the Notifications











