OTT: ఓటీటీలో ఏ స్టార్ హీరోకు టాప్ రెమ్యునరేషన్ తెలుసా? సినిమాల్లో కంటే అత్యధికంగా పారితోషికం ఎవరికంటే?

ఓటీటీ అనగానే ముందుగా గుర్తొచ్చేది దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఆ తరువాత ఆహా, ఈటీవి విన్ కూడా. ఇక ఇటీవల కాలంలో ఓటీటీలో స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు. మరి వారిలో ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారు ? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

కరోనా తర్వాత మన జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చి చేరాయి. లాక్ డౌన్ లో జనాలు ఓటిటి ప్లాట్ఫామ్ లకు బాగా అలవాటు పడ్డారు. అప్పటి నుంచి రోజురోజుకూ ఓటీటీ సంస్థలకు సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారు. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుండడంతో వీటికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Do you Know How much Ajay Devgan s Remuneration for Web Series on OTT

ఈ నేపథ్యంలోనే ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లలో కనిపించడానికి, పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓటీటీ సిరీస్, సినిమాలలో నటిస్తే అన్ని వర్గాల మూవీ లవర్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. మరింతగా ఫాలోయింగ్ పెరుగుతుంది.

దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. అయితే సిల్వర్ స్క్రీన్ పై నటించే ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషకం అందుకుంటున్న నటీనటులు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా అదే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.

మరి ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఓటిటి స్టార్ ఎవరు అంటే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. నిజానికి అంతకు ముందు వరకు ఈ ప్లేస్ లో మనోజ్ బాజ్ పాయ్ ఉన్నాడు. ఆయన అప్పట్లో సంచలనం సృష్టించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కోసం 10 లక్షలు వసూలు చేసినట్టుగా సమాచారం.

Do you Know How much Ajay Devgan s Remuneration for Web Series on OTT

అయితే అజయ్ దేవగన్ మాత్రం ఏకంగా కోట్లలోనే పారితోషికం అందుకున్నాడు. ఆయన రీసెంట్ గా రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించగా, ఒక్కో ఎపిసోడ్ కు 18 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారు. ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్ లు ఉండగా, మొత్తానికి కలిపి ఆయన ఖాతాలో 125 కోట్లకు పైగా పారితోషకం రూపంలో పడిందని సమాచారం.

దీంతో అజయ్ దేవగన్ భారీ రెమ్యూనరేషన్ తీసుకునే ఓటీటీ స్టార్స్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. 2022లో అజయ్ దేవగన్ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రుద్ర ; ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ లో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు.

ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కోసం అజయ్ అభిమానులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన సైతాన్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత మైదాన్ అంటూ థియేటర్లలోకి వచ్చారు. కానీ ఈ స్పోర్ట్స్ డ్రామాకు పాజిటివ్ టాక్ వచ్చినా, ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X