Baby: టెలివిజన్‌పై టాప్ టీఆర్పీతో దుమ్ము రేపిన బేబీ.. రేటింగ్ ఎంతో తెలుసా? నాని మూవీని వెనక్కి నెట్టి!
చిన్న సినిమాగా రిలీజ్ అయి బేబీ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీ థియేటర్లలో వంద కోట్ల రూపాయలను కొల్లగొట్టగా.. ఓటీటీలోనూ అంతే జోరు చూపించింది. ఇక ఇప్పుడు బుల్లితెరపై కూడా భారీ రేటింగ్ సాధించింది. ఇటీవల ఈ సినిమా ఈటీవీలో ప్రసారం కాగా... ఈ సినిమా నాని సినిమాను వెనక్కి నెట్టి... మంచి టీఆర్పీ సాధించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా బేబీ. ఇక ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ పది కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 100కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమాలో వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఆకట్టుకుంది. ఇక విరాజ్, ఆనంద్ వారి నటనతో ఆకట్టుకున్నారు. యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఓటీీటీలోనూ ఈ సినిమా మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయింది. థియేటర్లోనే కాదు.. ఓటీటీలోనూ ఈ సినిమాకు జనాలు పట్టం కట్టారు.
ఇక టెలివిజన్ ప్రిమియర్ హక్కులను ప్రముఖ ఛానెల్ ఈటీవీ కొనుగోలు చేసింది. బేబీ సినిమాను 4 కోట్ల రూపాయలుక ఈటీవీ విక్రయించింది. ఇక ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్ గా ఇటీవల ఆదివారం ప్రసారం అయింది. ఇక ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బుల్లితెరపై కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. జనాలు టీవీల ముందు అతుక్కుని చూసినట్లు తెలుస్తోంది.
బేబీ సినిమా ఈటీవీలో సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం అయింది. ఇక ఈ సినిమా అర్బన్ ఎరియాల్లో 5.89 టీఆర్పీ సాధించగా... అర్బన్ ప్లస్ రూరల్ ఎరియాల్లో 5.67 టీర్పీని సాధించింది. ఇక ఇటీవల ఈటీవీలో ఈ సినిమా సంచలన రేటింగ్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈటీవీ అంటే పాత సినిమాలు అని భావిస్తాం.. అలాంటిది ఈ సినిమాను విక్రయించడం.. సంచలనంగా మారింది.

ఇక బేబీ సినిమాకు పోటీగా.. జెమినీలో నాని దసరా, స్టార్ మాలో శ్రీ విష్ణు సమజవరగమన సినిమాలు ప్రసారం అయ్యాయి. ఇక దసరా సినిమా అర్బన్ ఏరియాల్లో 4.99 టీఆర్పీ నమోదు కాగా... అర్బన్ ప్లస్ రూరల్ లో 4.22 టీర్పీ నమోదు చేసింది. ఇక సామజవరగామన మూవీ అర్బన్ ఏరియాల్లో 3.05 అర్బన్ ప్లస్ ఏరియాల్లో 2.75 టీఆర్పీ నమోదు చేసింది. ఇక బేబీ సినిమా నాని సినిమాను వెనక్కి నెట్టేసింది.


Click it and Unblock the Notifications











