Kalki 2898 AD థియేటర్‌లో రిలీజ్ కాకముందే ఓటీటీలోకి కల్కి.. మే 31న ప్రభాస్ మూవీ.. ట్విస్ట్ ఏమిటంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన కల్కి 2898 AD అలియాస్ ప్రాజెక్ట్ K చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. ఇటీవలే విడుదలైన భైరవ, బుజ్జి గ్లింప్స్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన భాగాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కల్కి 2898 AD మూవీ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ తమ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఓ సెన్సేషన్ మూవీని ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమైంది. సుమారుగా 700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించింది. ఈ చిత్రంలో దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమా రేంజ్ పెరిగింది.

Do You Know Kalki 2898 AD is Releasing on Amazon Prime OTT before its Theatrical Release Here is the twist in Prabhas Movie

కల్కి సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది.అయితే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన తర్వాత చివరకు జూన్ 27వ తేదీన విడుదలకు ముహుర్తం నిర్ణయించారు. దాంతో ప్రమోషన్స్ కార్యక్రమాల జోష్ పెంచారు. ఇటీవల ప్రభాస్ లుక్ భైరవ, ఆయన వాహనం బుజ్జి ఫ్యూచరిస్టిక్ వెహికిల్‌ను హైదరాబాద్‌లో అట్టహాసంగా రిలీజ్ చేశారు.

కల్కి మూవీ గ్లింప్ప్ అభిమానులచే కేక పెట్టించింది. సాధారణ ప్రేక్షకులను విజువల్స్ కొత్త అనుభూతికి గురి చేయడంతో సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. ఇక ఇదే జోష్‌ను కంటిన్యూ చేయడానికి ట్రైలర్‌ను జూన్ తొలివారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Do You Know Kalki 2898 AD is Releasing on Amazon Prime OTT before its Theatrical Release Here is the twist in Prabhas Movie

ఇదిలా ఉండగా, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే.. ఓ ప్రయోగాన్ని చేస్తూ ఓటీటీలో తమ కంటెంట్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. బుజ్జి, భైరవ పాత్రలకు సంబంధించిన యానిమేషన్ సిరీస్‌ను మే 31న రిలీజ్ చేయనున్నారు.

బీబీ: బుజ్జి, భైరవ (B&B: Bujji & Bhairava)అనే యానిమేషన్ సిరీస్ రెండు భాగాలుగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే రిలీజ్‌కు ముందే యానిమేషన్ సిరీస్ ఎలాంటి అనుభూతికి గురి చేస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X