అమెజాన్ ప్రైమ్ వీడియోలో సరికొత్త ఫీచర్లు.. వాటి గురించి మీకు తెలుసా?
అరచేతిలోకి వినోదం రావడంతో సినీ అభిమానులకు సినిమా వీక్షణ మరింత పెరిగిపోయింది. దాంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు భారీగా ఆదరణ దక్కుతున్నది. పెరుగుతున్న వీక్షకులు, ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఖాతాదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఏమిటంటే?
ప్రేక్షకుల మారుతున్న అభిరుచిని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొన్న ఓటీటీ సంస్థలు వీక్షకుల సమయాన్ని వృథా చేయకుండా చర్యలు తీసుకొంటున్నది. వెంటనే ఆడియెన్స్‌కు కంటెంట్‌ను సులభంగా అందించేందుకు, కనిపించేలా ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేస్తున్నారు. అలాగే మంచి స్ట్రిమింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా చర్యలు తీసుకొంటున్నది.

అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా తన హోమ్ పేజ్‌లో నావిగేషన్ బార్‌లో కొత్త ఫీచర్లు డిజైన్ చేసింది. హోం, మూవీస్, టీవీ షోలు, లైవ్ టీవీలు గతంలో ఉన్నవాటిని మరింత ఆకర్షణీయంగా చేసింది. ఇక ప్రైమ్ వీడియోలో కొత్తగా ప్రైమ్ అనే బటన్‌ను చేర్చింది. దీని ద్వారా అమెజాన్‌లో ఉన్న టాప్ రేటెడ్ కంటెంట్‌ను కస్టమర్లు చూసుకొనే విధంగా డిజైన్ చేసింది.
అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కస్టమర్లు సర్చ్ చేసిన హిస్టరీని బట్టి వారికి ఇష్టమైన జోనర్లకు సంబంధించిన కంటెంట్‌ను సిఫారసు చేసే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం అమెజాన్ బెడ్ రాక్ అనే సాఫ్ట్ వేర్‌ను రూపొందించింది.

తాజాగా చేసిన మార్పుల ప్రకారం.. యూజర్ ఇంటర్‌ఫేస్‌కు యానిమేషన్ ఎఫెక్ట్స్ యాడ్ చేసింది. పేజీలను సులభంగా మారేందుకు, బటన్స్ జూమ్ చేసుకొనేందుకు వెసులబాటును కల్పించింది. అమెజాన్‌లో చేసిన మార్పులు కొత్త అనుభూతికి గురి చేస్తాయనే ఆశాభావాన్ని డిజైన్ విభాగం వైస్ ప్రసిడెంట్ కామ్ కేశ్మీరీ తెలిపారు.


Click it and Unblock the Notifications











