OTT సినిమా ఆఫర్లు లేక సూసైడ్ ప్రయత్నం.. ప్రస్తుతం ఓటీటీలో సూపర్ స్టార్.. ఆ హీరో ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమలో అవకాశాలు సాధించడం చాలా కష్టమైన పనే. వచ్చిన ఆఫర్‌ను నిలబెట్టుకోవడం ఇంకా కష్టమైనదే అని చెప్పాలి. సినిమా పరిశ్రమలో రాణించడానికి చేసిన ప్రయత్నం విఫలమై కొందరు జీవితాలను నాశనం చేసుకొన్న ఉదంతాలు మన కళ్ల ముందే కనిపిస్తుంటాయి. అలా సినిమా ఆఫర్లు లేక సూసైడ్ చేసుకొవాలనుకొన్న ఓ యాక్టర్ ప్రస్తుతం ఓటీటీలో సూపర్ స్టార్‌గా మారారు. ఆయన ఎవరనే వివరాల్లోకి వెళితే..

పక్కా పల్లెటూరు నుంచి కొండంత ఆశలతో సటుడు కావాలనే కోరికతో ముంబై, ఢిల్లీ నగరాల్లో అడుగు పెట్టిన టాలెంట్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయ్. హీరో రాజ్‌బబ్బర్‌ను చూసి 17 వయసులోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చి నటుడు కావాలని కోరుకొన్నాడు. కానీ ఆయన ప్రయత్నాలు ఎంతకు సఫలం కాలేదు. దాంతో తీవ్ర నిరాశలో మునిగిపోయాడు అని మనోజ్ బాజ్‌పేయ్ వెల్లడించారు.

Do You Know Manoj Bajpayee attempted suicide when Rejected for National School Of Drama

నా 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వచ్చిన తర్వాత సుమారుగా 4 ఏళ్ల నరకం చూశాను. ఆ నాలుగేళ్ల కాలం నాకు మరో జన్మ ఎత్తినట్టు అయింది. ఎన్నో ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అలాంటి సమయంలో నాకు ఏం చేయాలో తోచని పరిస్థితి. అప్పుడు చిన్న ఇరుకు గదిలో ముగ్గురం ఉండేవాళ్లుం. ఆ తర్వాత చిన్న ఇంటిలో 10 మంది కలిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మనోజ్ బాజ్‌పేయ్ అన్నారు.

ఇక చిన్న ఇంటిలో 10 మంది ఉన్న సమయంలో నాతోపాటు దర్శకుడు తిగుమాన్షు ధులియా, ధూమ్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య కూడా మాతో ఉన్నారు. అలాం జీవితం చాలా కష్టంగా మారిపోయింది. ఆఫర్లు వచ్చి చేజారాయి. దాంతో ఓ దశలో మనోధైర్యాన్ని కోల్పోయి సూసైడ్ చేసుకోవాలని అనుకొన్నాను. దాంతో నాతో ఉన్న వాళ్లు నా పక్కనే పడుకొని నన్ను చూసుకొనే వాళ్లు అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.

అలాంటి సమయంలో శేఖర్ కపూర్ దర్శకత్వంలో బండిట్ క్వీన్ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తీసిన సత్య సినిమాలో బీకూ మాత్రే పాత్ర లభించింది. ఆ రోల్ తర్వాత నా కెరీర్ ఊపందుకొన్నది. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, ఆలిఘడ్, వీర్ జారా లాంటి సినిమాలు నాకు మంచి స్టార్ స్టేటస్ ఇచ్చాయి అని అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.

Do You Know Manoj Bajpayee attempted suicide when Rejected for National School Of Drama

ప్రస్తుతం మనోజ్ బాయ్‌పేయ్ ఓటీటీలో సూపర్ స్టార్ అంటే అనుమానం అక్కర్లేదు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్నాడు. ఇటీవల వచ్చిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై, కిల్లర్ సూప్, గుల్ మొహర్ సీరీస్‌లు మనోజ్ బాజ్‌పేయ్ స్టార్‌గా మార్చేశాయి. కష్టంతోపాటు అదృష్టం తోడైతే ఎప్పటికైనా విజయం మనదే అని మనోజ్ బాజ్‌పేయ్ నిదర్శనంగా, స్పూర్తిగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X