Samantha: సమంత స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్" తెలుగు టైటిల్ ఏంటంటే?
స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు.. అంతకు మించిన టాలెంట్ కల్గిన ఈ క్యూట్ బ్యూటీ చివరగా ఖుషీ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ సిరీస్ ను ఇటీవలే పూర్తి చేసింది. అయితే హాలీవుడ్ లో వచ్చిన సిటాడెల్ వెబ్ సిరీస్ ను తెలుగులో రూపొందించగా.. సామంత, వరుణ్ ధావన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
హాలీవుడ్ వరిజినల్ సిరీస్ లో చిన్న చిన్న మార్పులు చేసి ఇండియన్ స్టైల్ కు తగ్గట్లుగా రూపొందించారు. అలాగే సిటాడెల్ టైటిల్ ను కూడా ఇక్కడికి తగ్గట్లుగా మార్చారు. ఆ విషయాన్ని నేరుగా చిత్రబృందం ఈరోజు వెల్లడించింది. ముఖ్యంగా ఇండియన్ వర్షన్ సిటాడెల్ టైటిల్ ను రివీల్ చేసి.. సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే సమంత ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సిరీస్ టైటిల్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హిందీ హీరో వరుణ్ ధావన్ కు జోడీగా స్టార్ హీరోయిన్ సమంత రూతు ప్రభు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తీసిన సిటాడెల్ కు ఇది ఇండియన్ వెర్షన్. అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా చేశారు. అయితే ఆమె అందులో చాలా బోల్డ్ గా కనిపించారు. మరి ఈ సిరీస్ లో సమంత అంత బోల్డ్ గా కనిపిస్తుందా.. లేక నార్మల్ గానే ఉంటుందా అనేది తెలియాలంటే మాత్రం కొంత కాలం ఆగాల్సిందే.
ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ను త్వరలోనే ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై వేదికగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ టైటిల్ ను ప్రకటించారు. ముఖ్యంగా సమంత వెబ్ సిరీస్ కు... సిటాడెల్: హనీ-బన్నీ అనే పేరును ఖరారు చేసినట్లు వివరించారు.

ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం సమంత మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. అలాగే ఆరోగ్యం బాగాలేకపోయినా.. ఎలాంటి డూప్ లు లేకుండా యాక్షన్ సీక్వెన్లలో నటించింది. వరుణ్ ధావన్, సమంతతో పాటు ఈ వెబ్ సిరీస్ లో కేకే మేనన్, సిమ్రాన్, సోహమ్ మజుందర్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతుంది అనేది. అలాగే ఏ రేంజ్ లో అలరిస్తుంది అనేది.


Click it and Unblock the Notifications











