Panchayat on OTT: పంచాయత్ వెబ్ సిరీస్‌లోని గ్రామం.. వాస్తవంగా ఎక్కడుందో తెలుసా ?
ఓటీటీలో అత్యంత పాపులర్ అయిన వెబ్ సిరీస్ 'పంచాయత్' మూడవ సీజన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లోని మొదటి రెండు సీజన్‌లు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. అందులోని ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా 'పంచాయత్'లోని ఫూలేరా గ్రామంలో జరిగిన ఈ కథ చాలా మందికి దగ్గరైంది. ఈ సిరీస్ వల్ల ఫూలేరా గ్రామం చాలా మంది దృష్టిలో పడింది. మరి అసలు ఈ గ్రామం నిజంగా ఎక్కడుందో ఓ లుక్కేద్దాం.
వెబ్ సిరీస్ పంచాయిత్ లో మనం చూసిన గ్రామం నిజంగానే ఉంది. ఆ ఫూలేరా గ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఉన్నట్టు సిరీస్ లో చూపించారు. కానీ ఆ ఊరికి, ఈ సిరీస్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఈ సిరీస్ షూటింగ్ జరిగిన గ్రామం నిజానికి మధ్యప్రదేశ్‌లో ఉంది. నిజ జీవితంలో ఈ గ్రామం మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఉంది. దీని పేరు నవా మహోడియా. మహోడియా అనే గ్రామంలో 'పంచాయత్' షూటింగ్ పూర్తయింది. ఈ మూడో సీజన్ షూటింగ్ కూడా రెండు నెలల పాటు మహోడియా గ్రామంలోనే జరిగింది.

'పంచాయత్ 3' షూటింగ్ మహోడియా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లాల్ సింగ్ సిసోసియా ఇంట్లో జరిగింది. ఈ సిరీస్‌లో చూపించిన ప్రధాన్ జీ ఇల్లు నిజ జీవితంలో లాల్ సింగ్ ఇల్లు. 'పంచాయత్ మొదటి సీజన్‌లో వాటర్ ట్యాంక్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఎందుకంటే ఈ ట్యాంక్‌పైనే సచి జీ, రింకీ మొదటిసారి కలుసుకున్నారు. ఆ వాటర్ ట్యాంక్ కూడా ఈ గ్రామంలోనే ఉంది.
''పంచాయత్' మొదటి, రెండవ సీజన్ షూటింగ్ కూడా మహోడియా గ్రామంలోనే జరగడం విశేషం. ఈ వెబ్ సిరీస్ మహోడియా గ్రామాన్ని సందర్శించే వారి సంఖ్యను పెంచింది. అయితే ఈ క్రమంలో ఆ ఊరి అసలు పేరు మార్చారని కొంత మంది గ్రామస్తులు మండి పడుతున్నారు. కాగా 'పంచాయత్ 3' షూటింగ్ వేసవిలో పూర్తయింది. నటీనటులు 45 నుండి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో షూటింగ్ పూర్తి చేశారు.

ఈ సిరీస్ లో పల్లెటూరి జీవితాన్ని మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించారు. పంచాయత్ 3 సిరీస్ కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, సాన్విక, చందన్ రాయ్, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా ప్రధాన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











