OTT ఓటిటీలో ఏ హీరోయిన్‌కు అత్యధిక రెమ్యునరేషన్ అంటే? స్టార్ హీరోలను మించి పారితోషికం ఎవరికంటే?
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న స్టార్ ఎవరు అంటే ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం అజయ్ దేవగన్ అని టక్కున చెప్తారు. కానీ ఆయన కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్న స్టార్ ఎవరో ఓ లుక్కేద్దాం.
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు కొన్నేళ్ల క్రితం దాకా నటీమణులు సినిమాల ద్వారా కొన్ని లక్షలు సంపాదించేవారు. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రం కోట్లలో పారితోషికం తీసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు చాలా మంది వందల కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. సినిమాతో పాటు ఓటీటీలో కూడా చాలా సిరీస్‌లు ఆదరణ పొందుతున్నాయి. ఆ విధంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో సహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రస్తుతం ప్రముఖ నటీనటులకు భారీ రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఓటీటీలో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ స్టార్స్ లో ఒకరు ప్రముఖ బాలీవుడ్ తారల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆమె మరెవరో కాదు. గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె ఓటీటీలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. ప్రైమ్ వీడియోలో ప్రసారమైన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రియాంక ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ సిరీస్ $250 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందించబడింది.
భారతీయ కరెన్సీలో చూస్తే రూ. 2000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు ఈ సిరీస్ కోసం. దీని కోసం కోసం తొలిసారిగా ప్రియాంక అందులో నటించిన హాలీవుడ్ హీరోతో సమానంగా పారితోషికం అందుకుంది. హీరో రిచర్డ్ మాడెన్ అందుకున్న ఖచ్చితమైన మొత్తం తెలియనప్పటికీ, ఆయన ఈ సిరీస్ కోసం $25-30 మిలియన్ల మధ్య అందుకున్నారని అంతర్జాతీయ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అంచనా వేసింది. రూపాయిలలో చూసుకుంటే రూ. 200-250 కోట్లు అని తెలుస్తోంది.

అంటే ప్రియాంక ఈ ఒక్క సిరీస్ కే దాదాపు 200 కోట్లకు పైగా పారితోషికం అందుకుందన్న మాట. ప్రియాంక కంటే ముందు అజయ్ దేవగన్ డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయిన రుద్ర : ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ వెబ్ సిరీస్ కోసం రూ. 125 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుని భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఓటీటీ స్టార్ గా నిలిచారు.
ఇప్పుడు ప్రియాంక ఆయన కంటే ఎక్కువ వసూలు చేసి, ఓటీటీలో భారీ పారితోషికం అందుకున్న స్టార్ గా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దీనర్థం ప్రియాంక సిటాడెల్ పారితోసికం ఏకంగా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సిరీస్ హీరామండికి పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ. అలాగే కరీనా కపూర్ జానే జాన్ సినిమాకు 12 కోట్లు, అలియా భట్ డార్లింగ్స్ కోసం 15 కోట్లు వసూలు చేసింది. సైఫ్ అలీ ఖాన్ వెబ్ సిరీస్ కోసం రూ. 25 కోట్ల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇతర నటీనటులు ఓటీటీలో రూ. 10 నుంచి 15 కోట్లు అందుకునటున్నారు. ఉదాహరణకు మనోజ్ బాజ్‌పేయి ది ఫ్యామిలీ మ్యాన్ కోసం రూ.10 కోట్లు అందుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











