Kalki 2898 AD ప్రభాస్‌కు భైరవ అని ఎవరు పెట్టారో తెలుసా?
ఈ ఏడాది రాబోయే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడి కూడా ఒకటి. భారీ బడ్జెట్, అత్యన్నత సాంకేతికతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా శివరాత్రి సందర్భంగా కల్కి సినిమా నుంచి ప్రభాస్‌కు సంబంధించి కొత్త లుక్, ప్రభాస్ పాత్ర పేరును పరిచయం చేశారు మేకర్స్. మరి ఈ పేరు ఎవరు పెట్టారు? ఈ పేరుతో గతంలో వచ్చిన సినిమాలు, హీరోల పాత్రల పేరు ఎంత వరకు ఆకట్టుకున్నాయో తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ రెబల్ స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. ఇప్పుడాయన చేతిలో అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. అయితే బహుబలితో తర్వాత ప్రభాస్ చేతిలో అన్నీ బడా సినిమాలే ఉన్నప్పటికీ ఆయన కెరీర్ అంత సాఫీగా సాగలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వరుస డిజాస్టర్లను అందుకున్నాయి. దీంతో చాలా మంది ఇక ప్రభాస్ కెరీర్ అయిపోతుందని అనుకున్నారు.

కానీ సలార్ చిత్రంతో బాక్సాఫీస్ ముందు గట్టి సమాధానం ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.700కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలోని ప్రభాస్ యాక్షన్ కటౌట్ ప్రతిఒక్కరినీ మైండ్ బ్లాక్‌కు గురి చేసింది. దెబ్బకు అందరూ స్టన్ అయిపోయారు.
అయితే ఇప్పుడాయన నుంచి రాబోతున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. తాజాగా శివరాత్రి సందర్భంగా కల్కి సినిమా నుంచి ప్రభాస్‌కు సంబంధించి కొత్త లుక్, ప్రభాస్ పాత్ర పేరును పరిచయం చేశారు మేకర్స్. దాని పేరు భైరవ అని తెలిపారు. ఈ పేరు వినగానే చాలా మందికి టక్కున ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమాలోని రామ్ చరణ్ పాత్ర గుర్తొచ్చింది. దీంతో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పడింది. ప్రభాస్ పేరును భైరవగా పెట్టడానికి కారణం దర్శకధీరుడు రాజమౌళి అని తెలిసింది. నాగ్ అశ్విన్ రాజమౌళి హెల్ప్ తీసుకుని ఈ పేరు పెట్టినట్లు ప్రచారం ఊపొందుకుంది. మరి ఇందులో నిజమెంతో తెలీదు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

కాగా, ప్రభాస్ - రాజమౌళి ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ స్నేహం వల్ల కూడా జక్కన్న భైరవ్ అనే పేరును సూచించారని కూడా అంటున్నారు. పైగా ఈ చిత్రంలో రాజమౌళి కూడా కెమీయో రోల్ కూడా చేస్తున్నారని ప్రచరాం సాగుతోంది. ఇంకా బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ భైరవద్వీపంను కూడా గుర్తుచేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే భైరవ పేర్లు ఉన్న ఈ రెండు చిత్రాలు(మగధీర, భైరవద్వీపం) టాలీవుడ్లో సూపర్ సక్సెస్‌ను సాధించాయి. దీంతో ఇక కల్కి కూడా మంచి విజయం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఇకపోతే కల్కిలో భారీ తారగాణం నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బోల్డ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటానీ, కోలీవుడ్ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్నారు. ఇంకా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా కెమియో రోల్స్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











