Rashmi Gautam: ఎక్స్ ట్రా జబర్దస్త్ షోను వీడబోతున్న రష్మి.. రివీల్ చేసిన కమెడియన్.. ఎందుకంటే?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే అద్భుతమైన షో జబర్దస్త్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కామెడీతో అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉండే ఈ షోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈషోలో జడ్జిలుగా, యాంకర్లుగా చేసే వాళ్లకు ఎంత మంచి పేరు వస్తుందో కూడా అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారానే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రష్మ గౌతమ్ తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోను వీడబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ షో యాంకర్లుగా ఇప్పటికే అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ లు చాలా ఏళ్లుగా చేశారు. రష్మి ఇప్పటికీ చేస్తూ వస్తోంది. అయితే అనసూయ స్థానంలోకి మాత్రం మరో కొత్త యాంకర్ ను తీసుకు వచ్చారు. ఆమె మరెవరో కాదు సిరి హన్మంత్. యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే ఈమెను యాంకర్ గా మార్చేశారు. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తుండగా.. రష్మి గౌతమ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తోంది. ఇలా అందరినీ నవ్వించడంలో.. అందాలు ఆరబోయడంలో ఎప్పుడూ ముందుండే ఈ యాంకర్ కూడా ఇప్పుడు ఈ షోకు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఇటీవలే వచ్చిన తాజా ఎపిసోడ్ లో ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ ఓ స్కిట్ వేశాడు. ఇందులో భాగంగానే ఆయన స్టేజీ మీదే యాంకర్ రష్మి ఈ షోను విడిచి వెళ్లబోతుందని చెప్పి షాక్ ఇచ్చాడు. దీంతో ఈమె వెళ్లిపోతే నెక్స్ట్ ఆ స్థానంలోకి ఎవరు వస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇస్మార్ట్ ఇమ్మానుయేల్.. రాజశేఖర్ హీరోగా చేసిన సింహరాశి సినిమాకు స్పూఫ్ చేశాడు. ఈక్రమంలోనే ముందుగా బాబు చిన్నప్పటి పాత్రలో కనిపించగా.. ఇమ్మానుయేల్ పెద్దయ్యాక కనిపించే హీరోగా కనిపించాడు. వర్ష అతిడిని ప్రేమించే అమ్మాయిగా దర్శనం ఇచ్చింది.
ముందుగా స్టేజీ మీదకు ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానుయేల్... ఓ తాంబూలం చేత పట్టుకుని వచ్చాడు. బట్టలు లేని వారికి, పేద వాళ్లకు బట్టలు ఇవ్వాలంటూ ఆయన అసిస్టెంట్ చెప్పగా.. వెంటనే ఆ తాంబూలం తీసుకుని యాంకర్ రష్మి వద్దకు వస్తాడు. ఈక్రమంలోనే దాని గురించి వివరిస్తూ.. దీన్ని తాంబూలం అంటారని.. ఎవరైనా వచ్చినా, ఎవరైనా వెళ్లిపోతున్నా దీన్ని ఇస్తారంటూ చెప్పుకొచ్చాడు. నువ్వు రావడం అయిపోయింది... ఇక వెళ్లడమే లేట్ అంటూ చెబుతూ ఆ తాంబూలాన్ని రష్మికి ఇచ్చాడు. ఆమె అది తీసుకోకపోవడంతో.. ఆమె కుర్చీపై దాన్ని పెట్టి వెళ్లిపోతాడు.

ఇదంతా చేసింది స్కిట్ కోసమే అయినా.. యాంకర్ రష్మి ఈ షోను వదిలి వెళ్లిపోతుందనేది హైలెట్ అయింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనసూయ బాటలోనే రష్మి కూడా జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేస్తుందా అని టాక్ నడుస్తోంది. మరి నెక్స్ట్ ఈ షో యాంకర్ గా ఎవరు ఉండబోతున్నారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











