డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన సూపర్ క్రైమ్ థ్రిల్లర్.. డేర్ ఉంటే అక్కడ చూసేయండి!
ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తూ సందడి చేస్తుండగా.. ఎక్కువ థ్రిల్లర్ చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓ అద్బుతమైన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ ఆ చిత్రాన్ని చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజరాజ చోర ఫేమ్ హీరోయిన్ సునైనా హీరోయిన్ గా వచ్చిన తాజా చిత్రం రెజీనా. సూపర్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రానికి డామిన్.డి. శివ దర్శకత్వం వహించాడు. డి సిల్వా మరియు ఎల్లో బేర్ ప్రొడక్షన్ బ్యానర్ పై సతీష్ నాయర్ ఈ సినిమాను నిర్మించగా.. సునైనా టైటిల్ రోల్‌లో నటించింది. అలాగే అనంత్, బావ చెల్లదురై, గజరాజ్, సాయి ధీనా, రీతు మంత్ర, నివాస్ అధితన్, వివేక్ ప్రసన్న మరియు అజీష్ జోస్ సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు.

రెజీనా సినిమాను గతేడాది తెరకెక్కించి.. అదే ఏడాది అంటే 2023 జూన్ 23వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ ద్విభాషా చిత్రాన్ని కేవలం తమిళంలో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో థియేటర్లు దొరక్కపోవడం, పెద్ద సినిమాలు ఉండడంతో.. కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ థియేటర్లు దొరక్క ఆ తర్వాత కూడా ఈ సినిమా విడుదల కాలేకపోయింది.
ముఖ్యంగా తమిళంలో ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోవడంతో... తెలుగు ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇలా తెలుగులో విడుదలకు నోచుకోని ఈ సినిమా తాజాగా చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా తమిళ వెర్షన్ లో ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చేసింది. ముఖ్యంగా సినిమా విడుదల అయిన 8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఎక్కడ అందుబాటులో ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా సునైనా ప్రధాన పాత్రలో వచ్చిన రెజీనా చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే ఓటీటీ వేధికగా ఫ్యామిలీతో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే వెళ్లండి. అద్భుతమైన థ్రిల్లర్ మూవీని చూసి సూపర్ ఫీలింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేయండి.


Click it and Unblock the Notifications











