OTTలోకి వచ్చేసిన దృశ్యం తరహా మూవీ... ఎందులో చూడాలంటే?
దృశ్యం, దృశ్యం 2 సినిమాలు తెరకెక్కించిన జీతు జోసేఫ్.. ఇటీవల నేరు అనే చిత్రం తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కూడా దృశ్యం తరహాలోనే సస్పెన్స్ థ్రిల్లర్ కోర్టు డ్రామాగా తెరకెక్కింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా దాదాపు 86 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే....
ఓటీటీలోకి మరో కొత్త సినిమా వచ్చేసింది. అప్పట్లో దృశ్యం సిరీస్ సినిమాలతో సంచలనం సృష్టించిన జీతు జోసేఫ్.. ఇటీవల మరో కొత్త కోర్టు డ్రామా నేరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కేరళలో బాక్సాఫీస్ దగ్గర నేరు చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. నేరు సినిమా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.86 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. నేరు చిత్రం 2023 క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా కేరళలోనే రూ.47 కోట్లు వసూలు చేయగా... ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్ల వసూళ్లు సాధించింది.
మలయాళ సినిమాల్లో అత్యధికగ వసూళ్లు సాధించిన సినిమాగా నేరు చిత్రం ఐదో స్థానంలో నిలిచింది. నేరు మూవీ ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను విక్టరీ వెంకటేష్ రీమేక్ చేయాలని అనుకున్నారు. ఇప్పటికే వెంకటేష్ దృశ్యం సిరీస్ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి రీమేక్ చేయాలని అనుకున్నారు.

కానీ ఏమైందో తెలియదు.. ఇంకా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇక వెంకటేష్ రీమేక్ చేయడం వల్ల ఈ సినిమా ఓటీటీలోకి తెలుగు వర్షన్ రాదు అంటూ ప్రచారం సాగింది. అయితే ఏం అయిందో తెలియదు కానీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నేరు చిత్రంలో మోహన్ లాల్ తోపాటు శాంతి, జగదీశ్, గణేష్ కుమార్, నందు, అదితి రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
నేరు స్టోరీ విషయానికి వస్తే... మోహన్‌లాల్, జీతు జోసేఫ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్నీ... న్యాయం కోసం బలవంతుడితో సామాన్యుడు సాగించే పోరాటం కథతో తెరకెక్కాయి. నేరు కూడా ఆ కోవకు చెందిన సినిమా అనే చెప్పవచ్చు. గత సినిమాలకు భిన్నంగా కొత్త బ్యాక్ డ్రాప్‌లో జీతూ జోసెఫ్ సినిమాను రూపొందించారు. పూర్తిగా కోర్టు రూమ్ డ్రామాగా నేరు మూవీ రూపొందించింది. ఓ నిస్సహాయురాలైన అంధురాలికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ లాయర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











