Dude on OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి డ్యూడ్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మించిన చిత్రం డ్యూడ్. తమిళ సినీ హీరో ప్రదీప్ రంగనాథన్, ప్రేమలు సినిమాతో ప్రేక్షకులకు చేరువైన మమిత బైజు జంటగా నటించారు. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.

రొమాంటిక్ కామెడీ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో ఆర్ శరత్ కుమార్, హిృదు హరూన్, డెవిడ్ సెల్వమ్, రోహిణి, ఐశ్వర్య శర్మ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటింగ్ బాధ్యతలను, సాయి అభయంకర్ మ్యూజిక్ అందించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆపూర్వ ఆదరణకు నోచుకొన్నది. భారీ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం థియేట్రికల్‌ రన్ ముగించుకొని ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది? ఎక్కడ చూడొచ్చనే వివరాల్లోకి వెళితే..

Dude on OTT

డ్యూడ్ సినిమా కథ విషయానికి వస్తే.. తాను అమితంగా ప్రేమించిన అమ్మాయి మరో యువకుడిని ఇష్టపడితే.. ఆమె ప్రేమక ోసం కోసం ఎంతకైనా తెగించే యువకుడి పాత్రలో ప్రదీప్ రంగనాథన్ నటించాడు. రిలేషన్‌షిప్స్, లవ్, రొమాంటిక్ కథగా తెరకెక్కింది. ఈ సినిమాను హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

ఢ్యూడ్ చిత్రం థియేట్రికల్‌గా రెండు వారాలపాటు బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటింది. ఈ సినిమా తమిళనాడులో 55 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయలు, కన్నడలో 6.5 కోట్ల రూపాయలు, మలయాళంలో 3.5 కోట్ల రూపాయలు, హిందీలో ఒక కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ థియేట్రికల్ రన్‌లో 74 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలుచేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 29 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 103 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

థియేట్రికల్ రన్ ముగించుకొన్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమా నవంబర్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ చేసుకొన్న వాళ్లు.. లేదా ప్రదీప్ రంగరాజన్, మమితా బైజును అభిమానించే వారు.. తీరిక వేళలో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఇటీవల కాలంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం మీకు మంచి అనుభూతిని పంచుతుందేమో.. ఓసారి చెక్ చేసుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X