King of Kotha OTT: ఆ ఓటీటీలోకి దుల్కర్ పాన్ ఇండియా మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్ కొత్త'. అభిలాష్ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాలం, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ గురువారం వచ్చి.. పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ రేటుకు విక్రయించిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
సీతారామం చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. రామ్ పాత్రలో దుల్కర్ నటన... ప్రతి అమ్మాయిని కదిలించింది. ప్రేమికుడు అంటే ఇలా ఉండాలి అనిపించేలా నటించాడు. ఇక ఈ సినిమాకు ముందే దుల్కర్ తెలుగులో సినిమాలు రిలీజ్ చేశాడు. కాకపోతే అవి స్ట్రేయిట్ తెలుగు సినిమాలు కావు. డబ్బింగ్ సినిమాలు. అలా ఓకే బంగారం సినిమాతో తెలుగులోకి ఎంటర్ అయిన దుల్కర్... అమ్మాయిల రాకుమారిడిలా మారిపోయాడు.

ఇక దుల్కర్ సల్మాన్ కు ప్రతి భాషలో మంచి క్రేజ్ అయితే ఉంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అన్ని లాంగేజ్వేస్ లో ఆయనకు గుర్తింపు అయితే ఉంది. ఇక ఆయన గత ఏడాది సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇండస్ట్రీలో సూపర్ హిట్టుగా నిలిచి.. రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఇక ప్రేమకథా చిత్రం తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం... కింగ్ ఆఫ్ కొత్త. ఇక ఈ సినిమా ఆగస్టు 24వ తేదీన తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ డాన్ గా కనిపించి... పర్వాలేదనిపించారు.
ఇక 'కింగ్ ఆఫ్ కొత్త' చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.
దుల్కర్ నటించిన ఈ కింగ్ ఆఫ్ కొత్త మూవీకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్స్ అయ్యాయి. డిస్నీ+ హాట్ స్టార్ స్ట్రీమింగ్‌కి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన 40 రోజులకు ఓటీటీలోకి రానుందని సమాచారం. ఇక మూవీ థియేట్రికల్ టాక్ ఎలా ఎట్లుంటుందో, ఎంత కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











