OTTలోకి రీసెంట్ సూపర్ హిట్ గ్యాంగ్‍స్టర్స్ డ్రామా... స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
సీతారామం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఈ హీరోకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన మొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో కింగ్ ఆఫ్ కొత్త సినిమా రూపొందించింది. ఈ సినిమా ఆగస్టు 24వ తేదీన థియేటర్లకు రాగా.. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. ఈ సినిమా దుల్కర్ కెరియర్ లో పాన్ మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో థియేటర్లలో రిలీజైంది. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి కింగ్ ఆఫ్ కొత్తకు మిక్స్ డ్ టాక్ లభించింది.

యాక్షన్ సీన్లు, దుల్కర్ పర్ఫార్మెన్స్ లాంటివి బాగున్నా ఓవరాల్ గా కింగ్ ఆఫ్ కొత్త సినిమాకు ఎక్కువ మంది ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఈ సినిమా ఆశించిన రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. కాగా... ఇప్పుడు 'కింగ్ ఆఫ్ కొత్త' మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం.
కింగ్ ఆఫ్ కొత్త మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. సెప్టెంబర్ 22వ తేదీన డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్‍లో కింగ్ ఆఫ్ కొత్త సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సెప్టెంబర్ 22నే ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కింగ్ ఆఫ్ కొత్త చిత్రానికి అభిలాష్ జోష్లీ దర్శకత్వం వహించంగా... గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కింది. ట్రైలర్ తో మంచి హైప్ తెచ్చుకున్నా.. ఆ స్థాయిలో సినిమా కలెక్షన్లను సాధించలేకపోయిందని తెలుస్తోంది. వేఫారెర్ ఫిల్మ్స్ బ్యానర్ పై జీస్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమాను హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించారు. సుమారు రూ.50కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‍గా చేశారు. గోకుల్ సురేశ్, షబ్బీర్ కల్లరక్కల్, ప్రసన్న, షమ్మి తిలకన్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉషా కీలకపాత్రల్లో నటించారు. ఓ స్పెషల్ సాంగ్‍కు రితికా సింగ్ చిందేశారు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమాలో గ్యాంగస్టర్ రాజు పాత్రలో దుల్కర్ నటన ఆకట్టుకుంది. మాస్ హీరోగానూ అతడి లుక్, యాక్టింగ్ అదిరిపోయాయి. యాక్షన్‍తో పాటు లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామా, ఫ్రెండ్‍షిప్ అంశాలు కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











