OTTలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్ గ్యాంగ్‍స్టర్స్ డ్రామా... ఎందులో చూడాలంటే?

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా దుల్కర్ సల్మాన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినా... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో ఓకే బంగారం సినిమాతో ఎంట్రీ ఇచ్చి... సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడు. అయితే ఆయన నటించిన సూపర్ హిట్ గ్యాంగ్ స్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కొత్త ఓటీటీలోకి వచ్చేసింది. దుల్కర్ పాన్ ఇండియా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కడ ఈ సినిమాను చూడాలి.. దీని కథేంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్... అన్ని భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తెలుగులో ఓకే బంగారం సినిమాతో దగ్గరైన ఈ హీరో... సీతారామం సినిమాతో అయితే అమ్మాయిలకు మరింత దగ్గరయ్యాడు. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్... ఎప్పటికీ మదిలో నిలిచిపోతుందంతే. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. ఇక ఈ సినిమా దుల్కర్ కెరియర్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది.

Dulquer Salmaan King of Kotha Movie Streaming Now on Disney plus Hotstar ott

ఇక కింగ్ ఆఫ్ కొత్త సినిమా గ్యాంగ్‌ స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. షబీర్‌ కల్లరక్కల్, ప్రసన్న, శరణ్‌ శక్తి, చెంబన్‌ వినోద్‌ జోస్, అనికా సురేంద్రన్, నైలా ఉష, శాంతి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వెంకటేష్‌ 'గురు' ఫేమ్ రితికా సింగ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిశింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది.

ఇక కింగ్ ఆఫ్ కొత్త సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. ఫారెర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై జీస్టూడియోస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ స్వయంగా కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాను నిర్మించారు. జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 24న బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు డిజిటల్ హక్కులను విక్రయించింది. అయితే ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సింది. కానీ ఆలస్యం అయింది.

Dulquer Salmaan King of Kotha Movie Streaming Now on Disney plus Hotstar ott

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో దుల్కర్ కొత్త మూవీ శుక్రవారం అర్ధ రాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నటన అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో గ్యాంగస్టర్ రాజు అనే పాత్రలో దుల్కర్ సల్మాన్‌ కనిపించాడు. యాక్షన్‌ తో పాటు లవ్‌ స్టోరీ, ఫ్రెండ్‌ షిప్‌, ఎమోషనల్‌ డ్రామా.. ఇలా అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మీరు గనుక ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే ఓటీటీలో చూసేయొచ్చు.

Dulquer Salmaan King of Kotha Movie Streaming Now on Disney plus Hotstar ott

ఇక దుల్కర్‌ సల్మాన్‌ లేటెస్ట్‌గా నటించిన గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ వెబ్‌ సిరీస్‌ కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తొలిప్రేమ, సార్‌ సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ సినిమాలో చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X