Sita Ramam: ఓటీటీ రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత.. న్యూ డేట్ ఫిక్స్!
పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రాలలో సీతారామం ఒకటి. ఈ సినిమా ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ధియేటర్స్ కు తరలివచ్చారు అని చెప్పవచ్చు. కొత్త సినిమాలు వచ్చినా పోటీగా మరికొన్ని సినిమాలు ఉన్నా కూడా సీతారామం కలెక్షన్స్ అయితే వారం వారం పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా ఊహించిన విధంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తిచేసుకుంది.
ఇక తర్వాత తొందరగానే ప్రాఫిట్ జాన్ లోకి వచ్చి పెట్టిన పెట్టుబడి కి డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది. వైజయంతి మూవీస్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేశాడు. అతనికి ఇంతకుముందు వరుసగా అపజయాలు ఉన్నప్పటికీ ఈ సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేదు. కంటెంట్ నచ్చితే జనాలు.. నటీనటులు ఎవరు దర్శకులు ఎవరు అనేవి కూడా చూడకుండా థియేటర్ కు వస్తారు అని సీతారామం సినిమా రుజువు చేసింది.

ఇక సీతారామం సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. మొదట ఆగస్టు లోనే అన్నారు. ఇక మొత్తానికి సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ఓటిటిలో అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అసలైతే ఆగస్టు చివరి వారంలో ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి కూడా సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటూ వచ్చింది. ముఖ్యంగా పండగ సమయాల్లో అలాగే వీకెండ్స్ లో కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం పెద్దగా కాంప్రమైజ్ కాలేదు. ఇక ఇప్పుడు మొత్తానికి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటుంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











