OTT ఓటీటీలోకి 4150 కోట్లు కొల్లగొట్టిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. ఎక్కడ? ఎలా చూడొచ్చంటే?

హాలీవుడ్‌లో భారీ విజయం అందుకొన్న డ్యూన్ పార్ట్ 1 మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం డ్యూన్ పార్ట్ 2. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన రితీలో కలెక్షన్లను రాబట్టింది. ట్రేడ్ అంచనాలకు మించి ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి ప్రవేశించింది. ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజైంది? ఎక్కడ? ఎలా చూడొచ్చు అనే వివరాల్లోకి వెళితే..

అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన డ్యూన్ పార్ట్ 2 చిత్రం మార్చి 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రంలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ లాంటి స్టార్ యాక్టర్లు నటించారు. అయితే ఈ సినిమాకు క్రిటిక్స్ జై కొట్టడంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్‌ను కుదిపేసింది.

Dune Part 2 streaming on OTT on Rent Base Here is OTT Name and Price to watch

ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అన్ని చోట్ల వసూళ్లు రాబట్టింది. కానీ ఇండియాలో ఈ సినిమా ప్రబావం చూపలేకపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో కేవలం 29 కోట్ల గ్రాస్.. 22 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఇంగ్లీష్ వెర్షన్ 27 కోట్లు రాబడితే.. హిందీ వెర్షన్ కేవలం 2.5 కోట్లు రాబట్టింది.

డెనిస్ విల్లెన్యూ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. హాలీవుడ్‌లో 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్ మూవీగా ఘనతను సాధించింది. ఈ చిత్రం నార్త్ అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో కలిపి 210 మిలియన్ డాలర్లు అంటే.. 1740 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Dune Part 2 streaming on OTT on Rent Base Here is OTT Name and Price to watch

ఒక ఓవర్సీస్ మార్కెట్‌లో డ్యూన్ 2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎదురేలేకుండా పోయింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూఏఈ, యూరోపియన్ యూనియన్ దేశాల్లో కలిపి ఈ చిత్రం 290 మిలియన్ డాలర్లు అంటే.. 2410 కోట్ల రూపాయలు వసూలుచేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 500 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 4150 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ రన్ ముగిసింది.

ఇంతటి విజయాన్ని సాధించిన డ్యూన్ 2 చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చింది. హాలీవుడ్ నిబంధనల ప్రకారం 45 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే ఈ సినిమాను ఫ్రీగా చూడకుండా అమెజాన్ ట్విస్టు ఇచ్చింది. తొలుత ఈ సినిమాను రెంట్ చెల్లించి చూసే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొద్ది రోజుల్లో ఈ సినిమా ఉచితంగా అందుబాటులోకి రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X