Maya Bazaar For Sale గేటెడ్ కమ్యూనిటీలో పైత్యాలు, విచిత్రాలు.. వెబ్ సిరీస్ రిలీజ్ ఎక్కడ? ఎప్పుడంటే?
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో దుమ్ము రేపుతున్న జీ 5 మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహ నా పెళ్లంట, ఏటీఎం, పులి మేక, వ్యవస్థ, విమానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇక ఈ లిస్టులో మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ చేరనుంది. మాయాబజార్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5తోపాటు టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా..మిరాజ్ మీడియా బ్యానర్ కలిసి సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాయి. గౌతమి చల్లగుల్ల దర్శకత్వంలో రాజీవ్ రంజన్ నిర్మాతగా రూపొందించిన మాయబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
మళ్లీ పెళ్లి, ఇంటింటి రామాయణం, సామజవరగమన చిత్రాలతో అందర్నీఆకట్టుకొంటున్న వీకే నరేష్, యువ నటుడు నవదీప్, ఝాన్సీ, ఈషా రెబ్బా, మెయంగ్ చంగ్, కోట శ్రీనివాసరావు, సునైన, హరితేజ, రాజా చెంబోలు, రవివర్మ తదితరులు నటించిన మాయా బజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.

మాయాబజార్ ఫర్ సేల్ ట్రైలర్‌ను పరిశీలిస్తే.. మాయాబజార్ అనే గేటెడ్ కమ్యూనిటిలో ఫ్యామిలీ మధ్య జరిగే సంఘటనలు పూర్తిగా వినోదాత్మకంగా చూపించారు. రకరకాల అలవాట్లు, అభిరుచులుతో ఉండే ఫ్యామిలీల మధ్య చోటు చేసుకొనే గొడవలు, చిన్న చిన్నతగువులు ఆసక్తికరంగా కనిపించాయి.
ఇలాంటి వాతావరణంలో కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు గేటెడ్ కమ్యూనిటీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కట్టారు. వాటిని కూల్చివేయాలనే అధికారులు వచ్చినప్పుడు ఫ్యామీలీ గందరగోళంలో పడినట్టు కనిపించింది.

ఓ గేటెడ్ కమ్యూనిటిలో రకరకాల అభిప్రాయ బేధాలు ఉన్న ఫ్యామిలీలు.. తమకు కష్టం వస్తే ఏకమయ్యారా? లేదా ఎవరికి వారు పోట్లాడుకోవడమే ఉందా అనే విషయం మాయాబజార్ ఫర్ సేల్ సినిమాలో ఆసక్తికరంగా మారింది. రకరకాల ఎమోషన్స్‌తో రూపొందిన వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ ఫ్లాట్‌ఫామ్ జీ 5లో జూలై 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











