Eliminate Bindu Madhavi బిందు మాధవి వెకిలి చేష్టలు.. మిత్రా శర్మను అవమానించడంపై నెటిజన్లు ఫైర్

బిగ్‌బాస్ తెలుగు నాన్ స్టాప్‌లో కంటెస్టెంట్ల వ్యవహార తీరుపై నెటిజెన్లు భగ్గుమంటున్నారు. ఈ షోలో టాప్ కంటెస్టెంట్లలో ఒకరైన బిందు మాధవి వ్యవహార తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా బిందు మాధవి చేసిన వెకిలి చేష్టలపై బిగ్‌బాస్ అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జాతీయ ఛానెల్‌లో ప్రసారమవుతున్న షో అనే విషయాన్ని కూడా మరిచి బిందు మాధవి వ్యవహరించిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో చివరి నామినేషన్ల సందర్భంగా ఏం జరిగిందంటే..

చివరి నామినేషన్ ప్రక్రియ

చివరి నామినేషన్ ప్రక్రియ

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చివరి అంకానికి చేరుకొన్నది. చివరి నామినేషన్ల సందర్భంగా చేదు లడ్డూలను కంటెస్టెంట్ల ముందు బిగ్‌బాస్ ఉంచారు. ఇంటి సభ్యుల గురించి చేదు అనుభవాలు చెప్పాలి. ఇద్దరు సభ్యుల గురించిన లోపాలను చెప్పి నామినేట్ చేయాలని చెప్పారు. అయితే కంటెస్టెంట్లు ఎప్పటి మాదిరిగానే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొన్నారు. ఒకరిపై మరొకరు బాణాలు దూసుకొన్నారు.

బిందు మాధవి దురుసుగా

బిందు మాధవి దురుసుగా

అయితే నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా బిందు మాధవి మరోసారి తననైజాన్ని బయటపెట్టుకొన్నది. గతవారం నామినేషన్ల సందర్భంగా దురుసుగా ప్రవర్తిస్తూ మిత్రా శర్మపైకి దూసుకెళ్లడం.. ఆమె ముఖాన్ని పట్టుకొని ఘాటుగా మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మిత్రా శర్మ తనపై శారీరకంగా దాడి చేయడానికి ప్రయత్నించారనే అరోపణలకు హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అయితే అంతటితో వివాదం ముగిసిందనుకొన్నారు. కానీ తాజా నామినేషన్ల సందర్భంగా ఆ రోజు మిత్రా శర్మ చేసిన ఆరోపణలు ఇమిటేట్ చేస్తూ బిందుమాధవి గేలి చేసినట్టు ప్రవర్తిస్తూ.. మిత్రా శర్మను నామినేట్ చేశారు.

మిత్రా శర్మను టార్గెట్ చేస్తూ..

మిత్రా శర్మను టార్గెట్ చేస్తూ..

ఇక మిత్రా శర్మ నామినేషన్‌లో పాల్గొంటూ.. బిందు మాధవి చేసిన ఆరోపణలపై మరోసారి చర్చ పెట్టారు. ఇంటి సభ్యులు చెప్పిన విషయాలు కాకుండా తన ఊహాగానాలతో ఎదుటి సభ్యులను టార్గెట్ చేస్తున్నారని తన నామినేషన్ పాయింట్ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే మిత్రా శర్మ మాటలకు అడ్డు పడుతూ బిందు మాధవి హిస్టీరియా వచ్చిన రోగిలా ప్రవర్తించింది. పిచ్చిపిచ్చిగా గెంతులెస్తూ.. మానసిక రోగిలా ప్రవర్తించింది. బిందు మాధవి ప్రవర్తన ఇంటి సభ్యులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎలిమినేట్ బిందు మాధవి

ఎలిమినేట్ బిందు మాధవి

అయితే నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా బిందుమాధవి చేసిన వెకిలి చేష్టలకు మిత్రా శర్మ సహనం ప్రదర్శించింది. బిందు మాధవి రెచ్చగొట్టినా శాంతంగా నామినేషన్ల సమయంలో తన పాయింట్‌ చెప్పి నామినేట్ చేసింది. అయితే బిందు మాధవి చేసిన వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ.. Eliminate Bindu Madhavi హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో #EliminateBinduMadhavi అనే ట్యాగ్ నేషనల్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది

నామినేషన్‌లోకి ఏడుగురు కంటెస్టెంట్టు

నామినేషన్‌లోకి ఏడుగురు కంటెస్టెంట్టు


ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో చివరి నామినేషన్ ప్రక్రియ గందరగోళం మధ్య ముగిసింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్లలో ఏడుగురు ఉన్నారు. ఈ వారం శివ, అరియానా గ్లోరి, అషురెడ్డి, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్ సార్థక్, అనిల్ రాథోడ్ నామినేట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X