సుడిగాలి సుధీర్ తెల్లవార్లూ ఆ పని చేస్తాడు: బాగోతం బయటపెట్టిన కమెడియన్

ఒకప్పుడు సినిమా హీరోలకు మాత్రమే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం బుల్లితెరపై కనిపించే సెలెబ్రిటీలకు సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. అలా ఇప్పుడు సెన్సేషన్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. కమెడియన్‌గా సత్తా చాటిన అతడు.. ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో దూసుకెళ్తోన్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ కమెడియన్.. సుడిగాలి సుధీర్‌పై కామెంట్స్ చేశాడు. ఆ వివరాలను మీరే చూడండి!

బుల్లితెరపై స్టార్‌డమ్‌తో:మెజీషియన్‌గా కెరీర్ మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. జబర్ధస్త్ షోలోకి ఆర్టిస్టుగా అడుగు పెట్టాడు. మొదట్లో స్కిట్లు చేసి అలరించిన అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి తనదైన స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి ఈ షో ద్వారా సుధీర్ స్టార్‌‌డమ్ అందుకున్నాడు.

Emmanuel Funny Comments on Sudigali Sudheer in Sarkaar 4 Show

వరుస సినిమాలు చేస్తూ:ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై సత్తా చాటిన సుడిగాలి సుధీర్.. ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలను పోషించాడు. అదే సమయంలో హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవి అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. కానీ, 'గాలోడు'తో కెరీర్ బెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాడు.

గోట్‌ అంటూ రెడీగానే:'గాలోడు' వంటి క్రేజీ హిట్ తర్వాత సుడిగాలి సుధీర్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇలా ఇటీవలే 'కాలింగ్ సహస్ర' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఈ మూవీ అనుకున్న విధంగా ఆడలేదు. ఫలితంగా సుధీర్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఇక, ఇప్పుడు ఈ టాలెంటెడ్ గాయ్ 'GOAT' అనే సినిమాలో నటిస్తున్నాడు. అది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Emmanuel Funny Comments on Sudigali Sudheer in Sarkaar 4 Show

ఓటీటీ, టీవీలో ఎంట్రీ:చాలా కాలంగా సినిమాలపై మాత్రమే ఫోకస్ చేస్తూ బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. ఇప్పుడు ఆహా ఓటీటీలో 'సర్కార్ 4' అనే షోను హోస్ట్ చేస్తున్నాడు. దీనితో పాటు ఈటీవీలో 'ఫ్యామిలీ స్టార్స్' అనే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టేశాడు. వీటితో పాటు మరికొన్ని షోలను చేయడానికి సుడిగాలి సుధీర్ రెడీ అవుతున్నట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Emmanuel Funny Comments on Sudigali Sudheer in Sarkaar 4 Show

గంగం గణేషా టీమ్‌తో:సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో 'సర్కార్ 4' షోను చేస్తున్నాడు. ఇందులో ఏడో ఎపిసోడ్ కోసం 'గంగం గణేశా' మూవీ టీమ్ నుంచి ఆనంద్ దేవరకొండ, ఇమాన్యూయేల్, ప్రగతి, ప్రిన్స్ యావర్‌లు వచ్చారు. వీళ్లతో కలిసి అతడు తనదైన రీతిలో సందడి చేశాడు. అంతేకాదు, పంచ్‌లు, సెటైర్లు వేస్తూ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

తెల్లవార్లూ చేస్తాడని:'సర్కార్ 4' తాజా ప్రోమోలో ఇమాన్యూయేల్.. సుధీర్‌పై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ప్రిన్స్ యావర్‌ను సుధీర్ 'బాడీ ఏంటి ఇంత ఫిట్‌గా ఉంది' అనగా.. 'ప్రతి రోజూ వర్కౌట్ చేస్తాను' అని బిగ్ బాస్ ఫేం ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు ఇమాన్యూయేల్ 'అతడు ఉదయం వర్కౌట్ చేస్తాడు. మీరు ఉదయం అయ్యేదాకా చేస్తారు' అని సుధీర్ పరువు తీశాడు. ఇదే కాదు.. సుధీర్‌ను పెద్ద కాటు అని కూడా అన్నాడు. ఇలా ఈ ప్రోమో మొత్తం అతడిపై పంచ్‌లు పడుతూనే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X