OTTలోకి సూపర్ హిట్ ఎమోషనల్ లవ్ డ్రామా - మీ ప్రేమ బ్రేకప్ కాకూడనుకుంటే ఈ మూవీ డోంట్ మిస్!
ఓటీటీలోకి మరో కొత్త రొమాంటిక్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా వచ్చేెందుకు రెడీ అయింది. ఈ వీకెండ్ సర్ప్రైజ్గా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. రీసెంట్గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ సినిమాకు మంచిన కలెక్షన్లను అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం...
జై భీమ్ చిత్రంలో పోలీసుల చేతిలో చిక్కి అన్యాయంగా బలైపోయిన బాధితుడిగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మణికందన్. అనంతరం గుడ్ నైట్ అనే చిత్రంతో ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. అలా తనకు వచ్చిన క్రేజ్‌తో రీసెంట్గా ట్రూ లవర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 10న వచ్చిన ఈ చిత్రం కూడా యూత్‌కు బాగానే కనెక్ట్ అయింది. ఇప్పటికీ ఐదో వారంలోనూ కొన్ని చోట్ల సక్సెస్‌గా రన్ అవుతోంది.

ఈ చిత్రంతో పాటు రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ కూడా అదే సమయంలో వచ్చింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కలెక్షన్లు కూడా రాలేదు. ఈ చిత్రానికి మించి ట్రూలవర్ సినిమానే ఎక్కువ వసూళ్లు సాధించినట్లు తెలిసింది. దీంతో తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగులో ట్రూ లవర్ పేరుతో విడుదలై బానే మెప్పించింది. ప్రముఖ దర్శకుడు మారుతి, బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ దీనిని ఇక్కడ విడుదల చేశారు.
ఈ సినిమాలో శ్రీ గౌరిప్రియ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ కోసం యూత్ ఆడియెన్స్ బాగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి 8 నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతందని ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు. అయితే తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మార్చి 15 నుంచి డిస్నీ హాట్ స్టార్ ప్లస్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంటే ఈ వీకెండ్లో శుక్రవారం రానుందనమాట. చూడాలి మరి ఓటీటీ ఆడియెన్స్‌ను ఎలా మెప్పిస్తుందో..

ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. కాలేజీ డేస్ నుంచే అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటుంటారు. అయితే ప్రతి విషయంలోనూ దివ్యపై అనుమానం పడుతూ ఉంటాడు అరుణ్. దివ్య మరొకరితో కాస్త క్లోజ్‌గా కనిపించిన కూడా అస్సలు తట్టుకోలేడు. ఏ మాత్రం సహించలేడు. దీంతో ఈ ఇద్దరి మధ్య తరచు గొడవలు రావడం మొదలవుతుంది. కొద్ది కాలం అలానే భరించిన దివ్య చివరికి అరుణ్ ప్రవర్తనకు విసిగిపోయిన బ్రేకప్ చెప్పేందుకు రెడీ అవుతుంది.
ఈ క్రమంలోనే దివ్య తన స్నేహితులతో కలిసి ఓ టూర్‌కు వెళ్తుంది. ఆమెతో పాటు అరుణ్ కుడా అక్కడికి వెళ్తాడు. మరి అక్కడ ఏం జరిగింది? దివ్య ప్రేమను చివరికి అతడు అర్థం చేసుకుని తన ప్రవర్తనను మార్చుకున్నాడా? లేదా? అన్నదే ఈ చిత్ర కథాంశం. అపనమ్మకం, అభద్రతా భావంతో ఉన్న ప్రేమ నిలబడలేదనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ చిత్రాన్ని ఎమోషనల్‌గా తెరకెక్కించి ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











