OTTలోకి నెలకాకముందే ఎమోషనల్ లవ్ రొమాంటిక్ డ్రామా... ఎందులో చూడాలంటే?
రొమాంటిక్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ఓటీటీలోకి రాబోతుంది. రిలీజ్ అయి నెల రోజులు కాకుండానే డిజిటల్ ప్రిమియర్ కు సిద్ధం అయింది. జై భీమ్, గుడ్ నైట్ చిత్రాల ఫేమ్ నటుడు మణికందన్ నచించిన చిత్రం ట్రూలవర్. ఇటీవల ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుందని తెలుస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ డ్రామా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఈ స్టోరీలో చూసేద్దాం.
జై భీమ్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మణికందన్ చాలా మందికి గుర్తే ఉంటుంది. అందులో బాధితుడిగా కనిపించాడు. ఇక అతని కోసం సూర్య పోరాటం సాగిస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తమిళంలో గుడ్ నైట్ అనే మూవీలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు వారికి సుపరిచితం అయిన మణికందన్ ఇటీవల ట్రూలవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ట్రూ లవర్ సినిమాలో మణికందన్‌కు జంటగా శ్రీ గౌరిప్రియ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాగా... తెలుగులో మాత్రం ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేశారు. ఇప్పటికే లవర్ పేరుతో తెలుగులో చిత్రం ఉండగా.. దీనికి ట్రూ యాడ్ చేసి ట్రూలవర్ పేరుతో తెలుగులో డైరెక్టర్ మారుతి, బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి థియేటర్లలో రిలీజ్ చేశారు.
యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను రూపొందించాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ ప్రిమియర్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా తమిళం, తెలుగు స్ట్రీమింగ్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందిన ట్రూ లవర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగానే వసూలు అవుతున్నాయి. డీసెంట్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా కథవిషయానికి వస్తే... కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ప్రతి విషయంలో దివ్యపై అరుణ్ డౌట్ పడుతూ ఉంటాడు. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటే మాత్రం సహించలేడు. దీంతో వీరి మధ్య తరచు గొడవలు మొదలు అవుతాయి. అరుణ్ ప్రవర్తనకు విసిగిపోయిన దివ్య అతడికి బ్రేకప్ చెప్పాలని చాలా సార్లు భావిస్తుంది.
దివ్య తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ టూర్‌కు వెళ్తుంది. ఆమెతో అరుణ్ కుడా వెళ్తాడు. అక్కడ ఏమైంది? దివ్య ప్రేమను అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. అపనమ్మకం, అభద్రతా భావంతో కూడిన ఏ ప్రేమ నిలబడదనే పాయింటుతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమా రూపొందించాడు.


Click it and Unblock the Notifications











