4 ఏళ్ల తర్వాత OTTలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. శోభితా ధూళిపాళ నటించిన ఈ మూవీని ఎక్కడ చూడాలంటే?
ఓటీటీల హవా పెరుగుతున్నా కొద్దీ.. పాత చిత్రాలను సైతం ఓటీటీల్లోకి తీసుకు వస్తూ క్యాష్ చేసుకుంటున్నారు చాలా మంది దర్శక, నిర్మాతలు. ముఖ్యంగా తమ చిత్రం బాగుందని భావించినా.. వెంటనే వాటిని ఓటీటీల్లోకి తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఆ సినిమా వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సరే అన్ని భాషల వాళ్లకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఓటీటీలోకి ఓ క్రేజీ మూవీ రాబోతుంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నాలుగేళ్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన క్రేజీ మూవీయే ది బాడీ. ఈ సినిమాలో నటాషా, ఎలీషా మేయర్, శోభితా దూళిపాళ, వేధిక, రుష్కర్, ఇమ్రాన్ హష్మి, రిషి కపూర్, స్కార్లెట్ మెల్లిష్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 2019లో వచ్చిన ఈ సినిమాకు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. రిషి కపూర్, ఇమ్రాన్ హష్మీ, వేదిక, శోభితా ధూళిపాళలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ మూవీ.. 2012లో వచ్చిన ది బాడీ అనే స్పానిష్ చిత్రానికి రీమేక్.

2019 డిసెంబర్ 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మాత్రం ాశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మి హీరోగా చేసిన ఈ సినిమాలో అచ్చమైన తెలుగందం శోభితా ఆయన భార్యగా నటించింది. అయితే అకస్మాత్తుగా చనిపోయిన శోభితకు పోస్ట్ మార్టం చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. కానీ అంతోలనే ఈమె డెడ్ బాడీ మాయం అవుతుంది. అసలు ఆమె డెడ్ బాడీని ఎవరు తీసుకు వెళ్లారు, నిజంగానే ఆమె చనిపోయిందా.. అది హత్యా, లేక సహజ మరణమా అనేది తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

క్షణ క్షణం అదిరిపోయే థ్రిల్ ను పంచే ఈ క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలోకి వచ్చిన మూడేళ్లకు ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఇంది. ఇలా డిజిటల్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంటే.. కచ్చితంగా తెలుగులో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాషతో సంబంధం లేదనుకునే వాళ్లు, థ్రిల్లల్, సస్పెన్స్ వంటి చిత్రాలను ఇష్ట పడే వాళ్లు మాత్రం ఈ మూవీని కచ్చితంగా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మరి నెట్ ఫ్లిక్స్ లో తెలుగమ్మాయి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని చూసేయండి. ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











