EAGLE OTT: ఆ ఓటీటీలోనే ఈగల్ మూవీ.. ఎప్పుడు రాబోతుందో తెలిస్తే!

టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే మాస్ స్టార్‌డమ్‌ను అందుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో రవితేజ ఒకడు. ఆరంభం నుంచీ కమర్షియల్ సినిమాలు చేస్తోన్న అతడు.. ఇప్పుడు తన రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే రవితేజ 'ఈగల్' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీతో వచ్చాడు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే 'ఈగల్'. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగా లభించింది. ఇలా ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో మంచి వసూళ్లను రాబట్టినా.. రెండో వారం నుంచి ప్రభావాన్ని కోల్పోతూనే వచ్చింది.

ETV Win Bagged Ravi Teja Starrer EAGLE Movie Digital Rights

హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌తో రూపొందిన 'ఈగల్' మూవీకి థియేటర్లలో ఆశించిన రీతిలో రెస్పాన్స్ లభించలేదనే చెప్పుకోవాలి. ఫలితంగా ఈ చిత్రం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో రెండు వారాల్లోనే రన్‌ను ముగించుకుని నష్టాల దిశగా పయణిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఈగల్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డీల్ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి ఈ సినిమా ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీంతో రవితేజ అభిమానులు డీలా పడిపోయారు. ఈ పరిస్థితుల్లో తాజాగా 'ఈగల్' ఓటీటీ డీల్‌పై చిత్ర యూనిట్ అదిరిపోయే ప్రకటన చేసేసింది.

ETV Win Bagged Ravi Teja Starrer EAGLE Movie Digital Rights

మాస్ మహారాజా రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందిన 'ఈగల్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఓ పోస్టర్‌ను వదిలింది. ఇక, ఈ సినిమాను థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల లోపే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తాజాగా న్యూస్ లీకైంది.

ఇదిలా ఉండగా.. మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X