For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  F3 OTT Release: ఆ ఓటీటీలో ఎఫ్3 స్ట్రీమింగ్.. ఎందుకు ఆలస్యం అవుతుందంటే!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకోవడంతో ఫిల్మ్ మేకర్లు, హీరోలు ఈ తరహా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే సినిమాను చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల భారీ స్థాయిలో స్పందన అందించారు. దీంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫలితంగా నిర్మాతలకు లాభాల పంట పడింది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ లవర్ బాయ్.. అప్పుడు మిస్సైనా ఈ సారి కన్ఫార్మ్‌!

  'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ దీనికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగానే F3 పేరిట ఈ సినిమాను రూపొందించారు. సూపర్ హిట్ కాంబినేషన్‌ కావడంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్‌ను జరుపుకుంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ అయింది. దీంతో ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

  గతంలో సంక్రాంతి సీజన్‌లో తెగ సందడి చేసిన 'ఎఫ్2'కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం కావడంతో 'F3' చిత్రానికి ఆరంభంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే ఆరంభంలో మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. అయితే, ఇవి తర్వాత క్రమంగా తగ్గిపోయాయి. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఫుల్ రన్‌లో దాదాపు రూ. 45 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాలను కలుపుకుని దీనికి రూ. 55 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం దాదాపు రూ. 8 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

  లేటు వయసులో రెచ్చిపోయిన సుస్మితా సేన్: స్విమింగ్ పూల్‌లో అందాల ఆరబోత

  F3 Movie Streaming on SonyLIV From July 22nd

  థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన F3 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి చాలా రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని గురించి తాజాగా ఓ న్యూస్ తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను జూలై 22 నుంచి సోనీలివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నారట. డీల్ కుదుర్చుకునే సమయంలో రెండు నెలల వరకూ స్ట్రీమింగ్ చేయకుండా నిర్మాతలు సదరు సంస్థతో ఒప్పందం చేసుకున్నారని తెలిసిందే. అందువల్లే ఈ సినిమాను ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఇక, ఈ చిత్రం హక్కులను సోనీలివ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

  స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్రాంచేజీ మూవీనే 'F3'. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలను పోషించారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

  English summary
  Daggubati Venkatesh, Varun Tej Did F3 Movie under Anil Ravipudi Direction. This Movie Streaming on SonyLIV From July 22nd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X