OTTలోకి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫహాద్ ఫాజిల్ మూవీ.. రూ.130 రాబట్టిన దీన్ని ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీల వినియోగం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా సమ్మర్ కావడంతో.. ఎండల్లో బయటకు వెళ్లడం ఇష్టంలేని అనేక మంది ఇంట్లోనే కూర్చుని హాయిగా ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ హార్రర్, క్రైమ్, రొమాంటిక్, కామెడీ చిత్రాలను మరింత ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పటికీ ఓటీటీలో అనేక కామెడీ చిత్రాలు సందడి చేస్తుండగా.. తాజాగా మరో అదిరిపోయే కామెడీ యాక్షన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
అయితే ఆ సినిమా మరేదో కాదో ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన ఆవేశం సినిమా. దేశం మొత్తం మెచ్చిన ఈ క్రేజీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. కేవలం మలయాళ భాషలో మాత్రమే వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ ఇటీవలే రిలీజ్ అయి థియేటర్ల వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందరినీ మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వస్తుందనగా అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ చిత్రం ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జిత్తు మాధవన్ దర్శకత్వంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా వచ్చిన మలయాళ భాషా యాక్షన్ కామెడీ చిత్రమే ఆవేశం. ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ మరియు అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ నిర్మించారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, ప్రణవ్ రాజ్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్ నటించగా, మిధుట్టి, సజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్ సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం సుశిన్ శ్యామ్ అందించగా.. సమీర్ తాహిర్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్కున్నారు.
ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా మొదటి నుంటి పాజిటివ్ టాక్ తో దుమ్ము రేపింది. దకత్వం, యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, సంగీతం, సాంకేతిక అంశాలకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుందీ చిత్రం. రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మొత్తంగా రూ.130 కోట్లు వసూలు చేసింది.

2024లో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల్లో నాలుగో చిత్రంగా నిలిచిందీ చిత్రం. అంతేకాకుండా 2024లో దక్షిణ భారతంలో అత్యధిక వసూళ్లు చేసిన 7వ సినిమాగా, ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన 7వ మలయాళ చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. అయితే ఈ క్రేజీ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 9వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థనే ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











