ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ సూపర్ హిట్.. దేవరకొండను దారుణంగా టార్గెట్ చేశారేంటి? నెటిజన్ల పోస్టుల వెల్లువ
సినిమా పరిశ్రమలో కొద్దికాలంగా కొందరు అగ్రహీరోలను, వారి సినిమాలను సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ గట్టిగానే టార్గెట్ చేస్తుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు, ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను రిలీజ్ చేసి ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా డ్యామేజ్ అయిన సినిమాల్లో గుంటూరు కారం.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా. అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత టాక్ భిన్నంగా వినిపిస్తున్నది. ఈ సినిమా ఓటీటీ టాక్ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్ జంటగా వచ్చిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్, గ్లింప్స్, పాటలకు మంచి స్పందన రావడంతో మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. అయితే ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ దేవరకొండకు సక్సెస్ గ్యారెంటీ అనే అభిప్రాయం వ్యక్తమైంది.

అయితే ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్లు గానీ, ఇండియాలో స్పెషల్ షోలు పడక ముందే.. మూవీపై కుప్పలు తెప్పలుగా రివ్యూలు వచ్చాయి. ఈ మూవీ ఫ్లాప్ అంటూ యూట్యూబ్‌లో వీడియోలు హల్‌చల్ చేశాయి. దాంతో సినిమా పూర్తిగా నెగిటివ్ జోన్‌లోకి వెళ్లింది. అయితే ఈ చిత్రాన్ని చూడాలనుకొన్న ప్రేక్షకులపై దుష్ప్రచారం భారీగా పడింది.
ఇక థియేట్రికల్ ముగించుకొని ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ మూవీకి ఓటీటీలో భారీ స్పందన, రెస్పాన్స్ వ్యక్తమవుతున్నది. దాంతో రికార్డు స్థాయిలో వ్యూయింగ్ మినట్స్ రిజిస్టర్ అయ్యాయి. దాంతో ఈ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఇక ఓటీటీలో ఫ్యామీలీ స్టార్ మూవీని చూసిన వారంతా.. బాగుంది.. చాలా బాగుంది.. మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకొంటున్నాయి. థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఎందుకు ఈ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. విజయ్ దేవరకొండ మూవీని కావాలనే టార్గెట్ చేశారనే ట్వీట్లు, సోషల్ మీడియా పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. దాంతో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైమ్ లో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్ లో చూడలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంజాయ్ చేస్తున్నా అని ట్వీట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











