OTT: ఈవారం థియేటర్ లో చిన్న సిమిమల పోరు.. ఓటీటీలో కూడా డిఫరెంట్ మూవీస్!
జనవరిలో ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తూ పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకున్నాయి. ఇక బాలీవుడ్ లో పఠాన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో అంటే ఫిబ్రవరి 3న మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఇక అందులో అందరి ఫోకస్ ఎక్కువగా సందీప్ కిషన్ మైకేల్ సినిమాపైనే ఉంది.
ఈ సినిమా పాన్ ఇండియాన్ మూవీగా బజ్ క్తియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికి తెలుగులో మాత్రమే కొంత హైప్ క్రియేట్ చేసుకుంటోంది. ఇక సినిమాలో వరుణ్ సందేశ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే విజయ్ సేతుపతి కారణంగా తమిళంలో మరికొంత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాకు పోటీగా మరికొన్ని రాబోతున్నాయి.

రైటర్ పద్మభూషణ్, ప్రేమ దేశం కథ వెనుక కథ, సువర్ణసుందరి, రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిన్న సినిమాలు ఫిబ్రవరి 3న రాబోతున్నాయి. బుట్టబొమ్మ అనే సినిమా మాత్రం ఫిబ్రవరి 4న వస్తోంది. ఈ లిస్టులో సుహాస్ రైటర్ పద్మభూషణ్స్ సినిమా ఇప్పటికే కొన్ని ప్రీమియర్ షోల ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. మరోవైపు బుట్టబొమ్మ సినిమా కూడా కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమాలతో పాటు ఓటీటీలో కూడా ఈ వారం డిఫరెంట్ సినిమాలు వెబ్ సీరిస్ లు రియాలిటీ షోలుస్ట్రీమింగ్ కానున్నాయి. ఆహాలో అన్ స్టాపబుల్ షో ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ కానుండగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో అదే రోజు సెంబి అనే మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫిబ్రవరి 3న సోని లివ్ లో జాహ్ణబాద్ అనే వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే హాట్ స్టార్ లో ఫిబ్రవరి 1న హాలీవుడ్ న్యూ మూవీ బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి వీటన్నింటిలో ఏది ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











